Site icon HashtagU Telugu

Telangana Govt Return Gift : అల్లు అర్జున్ కు తెలంగాణ ప్రభుత్వం రిటర్న్ గిఫ్ట్ – RGV

Allu Arjun Revanth

Allu Arjun Revanth

Telangana Govt Return Gift : సంధ్య థియేటర్ (Sandhya Theater) వద్ద పుష్ప 2 ప్రీమియర్ షో సందర్బంగా జరిగిన తొక్కిసలాట లో ఓ మహిళా మరణించడంతో సంధ్య థియేటర్ యాజమాన్యం తో పాటు అల్లు అర్జున్ , అలాగే మేనేజర్ పై పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో భాగంగా శుక్రవారం అల్లు అర్జున్ ను అరెస్ట్ (Allu Arjun Arrest) చేయడం, రిమాండ్ కు తరలించడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. రాత్రి వరకు హైకోర్టు మధ్యంతర బెయిల్ వచ్చినప్పటికీ..జైలు అధికారులు పత్రాలు సరిగా లేవని చెప్పి , శనివారం ఉదయం రిలీజ్ చేసారు.

నిన్న బన్నీ అరెస్ట్ దగ్గరి నుండి ఈరోజు రిలీజ్ వరకు అంత ట్విస్ట్ లతో సాగింది. అల్లు అర్జున్ అరెస్ట్ వార్త తెలిసి యావత్ అభిమానులు షాక్ అయ్యారు. మొన్నటి వరకు అల్లు అర్జున్ పై కాస్త ఆగ్రహంగా ఉన్న మెగా అభిమానులు (Mega Fans) సైతం రోడ్లపైకి వచ్చి బన్నీ కి మద్దతు తెలిపారు. ఇదే సందర్బంగా తెలంగాణ సర్కార్ పై సినీ ప్రముఖులతో పాటు యావత్ సినీ ప్రేక్షకులు , పలు రాజకీయ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అటు తెలంగాణ ప్రభుత్వం నేతలు సైతం విమర్శలకు కౌంటర్లు ఇస్తున్నారు. ఈ తరుణంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (RGV) ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ కు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదే అంటూ ట్వీట్ చేసి మరింత కాకరేపారు.

అల్లు అర్జున్ ఇటీవల “పుష్ప 2″తో భారతీయ సినిమా చరిత్రలో పెద్ద విజయాన్ని సాధించారని, తన సినిమా ద్వారా దేశవ్యాప్తంగా తెలంగాణకు గౌరవాన్ని తీసుకువచ్చారని ఆయన తెలిపారు. అయితే, ఈ విజయానికి ప్రతిఫలంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనను జైలుకు పంపడం ద్వారా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తెలంగాణకు చెందిన పెద్ద స్టార్ అయిన అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం ద్వారా రాష్ట్రం అతని గౌరవాన్ని దెబ్బతీసిందని ఆయన ఆరోపించారు. ఇది తగదని, అటువంటి వ్యక్తిత్వాన్ని గౌరవించాలని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

ఆర్జీవీ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణకు చెందిన పెద్ద స్టార్ అయిన అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం ద్వారా రాష్ట్రం అతని గౌరవాన్ని దెబ్బతీసిందని ఆయన ఆరోపించారు. ఇది తగదని, అటువంటి వ్యక్తిత్వాన్ని గౌరవించాలని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు ఈ అంశంపై మరింత దృష్టిని ఆకర్షిస్తున్నాయి. చాలా మంది ఆర్జీవీ వ్యాఖ్యలపై స్పందిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు.

Read Also : TTD : తిరుమలలో 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు