Indian 2 : దశాబ్దాలు కాలం తరువాత శంకర్ మరియు కమల్ హాసన్ తమ సూపర్ హిట్ మూవీ భారతీయుడుకి సీక్వెల్ ని తీసుకు వస్తున్నారు. దాదాపు ఐదేళ్ల పాటు సెట్స్ పైనే ఉన్న ఈ చిత్రం.. ఈ వారం రిలీజ్ కి సిద్దమవుతుంది. షూటింగ్ బాగా లేట్ అవ్వడం, శంకర్ ఈ సినిమాతో పాటు రామ్ చరణ్ గేమ్ చెంజర్ ని కూడా తెరకెక్కించడంతో.. ఆడియన్స్ లో మూవీ పై పెద్దగా బజ్ కనిపించడం లేదు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన సాంగ్స్ అండ్ ట్రైలర్ కూడా సోసోగా ఉండడంతో అసలు హైప్ కనిపించడం లేదు.
అలాంటి ఈ చిత్రానికి కూడా భారీ హైప్ ఉన్న చిత్రాలు మాదిరి.. తెలంగాణలో టికెట్స్ ధర పెంచడం గమనార్హం. భారతీయుడు 2 టికెట్ ధరల పెంపునకు అనుమతిని ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50, మల్టీఫ్లెక్స్ లో రూ.75 పెంచుకునేలా ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఈ టికెట్ ధర పెంపు జులై 12 నుంచి 19 వరకు అమలులో ఉండనున్నాయట. అంతేకాదు వారం రోజుల పాటు ఐదో ఆట ప్రదర్శనకు కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.
కాగా ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. తమిళనాడులో కంటే తెలంగాణలోనే ఇండియన్ 2 టికెట్స్ ధర ఎక్కువుగా ఉందని వినిపిస్తుంది. మరి హైప్ లేని చిత్రానికి అధిక ధరలు పెట్టి, ఎలాంటి లాభాలను అందుకుంటారో చూడాలి. ఇక ఈ మూవీ విషయానికి వస్తే.. దీని రెండు భాగాలుగా తీసుకు వస్తున్నారు. ఇండియన్ 2, ఇండియన్ 3గా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. ఇండియన్ 3 షూటింగ్ కూడా ఆల్రెడీ పూర్తి అయిపోయింది. రెండో భాగం రిలీజైన ఆరు నెలలకు మూడో భాగం రిలీజ్ చేయబోతున్నట్లు శంకర్ తెలియజేసారు.