Sai Dharam Tej: మెగా హీరోకి నోటీసులు.. గంజాయి పేరుతో

సంపత్ నంది దర్శకత్వంలో సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం గాంజా శంక‌ర్. పూజాహెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ చిత్రానికి ఓ చిక్కొచ్చి ప‌డింది. ఈ సినిమా పేరులో ఉన్న గాంజా (గంజాయి) అనే ప‌దాన్ని తొల‌గించాల‌ని

Published By: HashtagU Telugu Desk
Sai Dharam Tej

Sai Dharam Tej

Sai Dharam Tej: సంపత్ నంది దర్శకత్వంలో సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం గాంజా శంక‌ర్. పూజాహెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ చిత్రానికి ఓ చిక్కొచ్చి ప‌డింది. ఈ సినిమా పేరులో ఉన్న గాంజా (గంజాయి) అనే ప‌దాన్ని తొల‌గించాల‌ని తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో చిత్ర యూనిట్‌కు నోటీసులు జారీ చేసింది.

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న గాంజా శంకర్ చిత్రంపై అనేక రూమర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమా ఇప్పటికే ఆగిపోయినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. చిత్ర యూనిట్ ఈ ప్రాజెక్టును హోల్డ్‌లో పెట్టారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాపై మరో వివాదం నడుస్తోంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం.. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సినిమా టైటిల్ మరియు కథాంశాన్ని పునఃపరిశీలించాలని చిత్ర నిర్మాతలకు నోటీసు జారీ చేసింది. చిత్ర కథానాయకుడు సాయిధరమ్ తేజ్, దర్శకుడు సంపత్ నంది, నిర్మాత సూర్యదేవర నాగవంశీకి ప్రభుత్వం నోటీసులు పంపింది.

చలనచిత్రం మాదకద్రవ్యాల వినియోగం మరియు అమ్మకాలను తెలియకుండానే ప్రోత్సహిస్తున్నట్టు ప్రభుత్వం అభిప్రాయపడింది. ఇది NDPS చట్టాన్ని ఉల్లంఘించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆదేశాలను పాటించకపోవడం చట్టపరమైన పరిణామాలకు దారితీయవచ్చు. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ కు నోటీసులు పంపినట్లు సమాచారం.

సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ , ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నిర్మాత నాగవంశీ, సాయి సౌజన్యతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. కాగా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Also Read: VIRAL: పోలీస్ జాబ్స్.. సన్నీలియోన్ పేరిట అడ్మిట్ కార్డు

  Last Updated: 18 Feb 2024, 12:21 PM IST