Actor Prabhas: భద్రాచలం ఆలయానికి ప్రభాస్ రూ. 10 లక్షల విరాళం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానాని (Bhadradri Temple)కి 10 లక్షల రూపాయల విరాళాన్ని హీరో ప్రభాస్‌ (Actor Prabhas) అందించాడు.

Published By: HashtagU Telugu Desk
Actor Prabhas

Prabhas

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానాని (Bhadradri Temple)కి 10 లక్షల రూపాయల విరాళాన్ని హీరో ప్రభాస్‌ (Actor Prabhas) అందించాడు. ప్రభాస్ సన్నిహితులు (Actor Prabhas) శనివారం ఆలయ కార్యనిర్వహణాధికారి రమాదేవికి రూ.10 లక్షల చెక్కును అందజేశారు. ఆయన ప్రతినిధులు దంతులూరి సత్యనారాయణరాజు, వేమారెడ్డి, విక్రమ్, శ్రీనివాసరెడ్డి శనివారం ఆలయానికి వచ్చి ఈవో రమాదేవికి చెక్కు అందజేశారు.

శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆ చిత్రం విజయవంతం కావాలని ప్రధాన ఆలయంలోని మూలవిరాట్‌కు, అనుబంధ ఆలయాల్లో ఆంజనేయుడికి, లక్ష్మీతాయారమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. కాగా, ప్రభాస్ విరాళంగా అందించిన రూ. 10 లక్షల మొత్తాన్ని అన్నదానం, గోశాల విస్తరణ, ఆలయ అవసరాల కోసం కేటాయించినట్టు ఏఈవో భవానీ రామకృష్ణారావు తెలిపారు.

Also Read: Delhi Restaurants: ఢిల్లీలో రూ. 100లోపు రుచికరమైన ఆహారాన్ని తినగలిగే ఉత్తమ రెస్టారెంట్లు ఇవే..!

ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. రాముడి పాత్రలో ప్రభాస్ ఆకట్టుకుంటున్నాడు. ఓం రౌత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతి సనన్ సీతగా నటిస్తోంది. మైథలాజికల్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ యాక్ట్ చేయగా.. జానకి పాత్రలో కృతి సనన్ కనిపించనుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్స్, టీజర్‌కు అభిమానుల నుంచి భారీ రెస్పార్స్ వచ్చింది. తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా ఆకట్టుకుంటోంది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాని జూన్ 16న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

  Last Updated: 14 May 2023, 07:00 AM IST