HanuMan OTT: హనుమాన్ పని అయిపోయిందా.. ఓటీటీ కంటే ముందు టీవీలో టెలికాస్ట్!

  • Written By:
  • Publish Date - March 9, 2024 / 11:05 AM IST

టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన తాజా చిత్రం హనుమాన్. ఈ ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా దాదాపుగా 400 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది. ఈ సినిమా ఏ ముహూర్తాన విడుదల అయిందో కానీ అప్పటి నుంచి ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ భారీగా కలెక్షన్లను సాధిస్తోంది. రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకొని అందరి చేత శబాష్ అనిపించుకుంది.

కాగా ఈ సినిమాను కన్నడ తమిళం హిందీ మలయాళ భాషల్లో కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. అన్ని భాషల్లో ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా పాన్ ఇండియా లెవెల్లో కలెక్షన్ల సునామీని సృష్టించింది హనుమాన్. అయితే ఇప్పటికే థియేటర్లో ఒక్కసారి ఈ సినిమాలో చూసిన ప్రేక్షకులు ఓటీటీ లో చూడడం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే హనుమాన్ డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు మరో షాకింగ్ న్యూస్. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 కూడా తమకెలాంటి సమాచారం లేదని చేతులెత్తేసింది.

దీంతో శివరాత్రి రోజు హనుమాన్ సినిమాను చూద్దామని ఆశించిన సినీ ప్రియులకు నిరాశే మిగిలింది. ఇదిలా ఉంటే హనుమాన్ హిందీ వెర్షన్ మాత్రం అప్పుడే టీవీ ప్రీమియర్ కు రెడీ అయిపోయింది. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ఇదే విషయంపై ట్వీట్ చేశాడు. మన విశ్వంలో తొలి సూపర్ హీరో ఇప్పుడు టీవీ స్క్రీన్లపై కనిపించనున్నాడు. మార్చి 16 రాత్రి 8 గంటలకు హనుమాన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ హిందీలో తొలిసారి కలర్స్ సినీప్లెక్స్, జియో సినిమాల్లో చూడండి అని సదరు ఛానెల్స్ ట్వీట్ చేశాయి. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సామాజిక సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మార్చి 16న మూవీ టీవీ టెలికాస్ట్ ఉండటంతో ఆలోపే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందేమోనని సినీ లవర్స్ భావిస్తున్నారు.