Teja Sajja : పూరీజగన్నాధ్ దర్శకత్వంలో తేజ సజ్జ సినిమా చేయబోతున్నారా..?

పూరీజగన్నాధ్ దర్శకత్వంలో తేజ సజ్జ సినిమా చేయబోతున్నారా..? ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన..

Published By: HashtagU Telugu Desk
Teja Sajja New Movie With Puri Jagannadh Is In Talks

Teja Sajja New Movie With Puri Jagannadh Is In Talks

Teja Sajja : టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ.. ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా విజయాన్ని అందుకొని సూపర్ ఫేమ్ ని సంపాదించుకున్నారు. ఇప్పుడు వచ్చిన ఆ ఇమేజ్ నిలబెట్టుకునేలా స్క్రిప్ట్స్ ని సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈక్రమంలోనే ‘మిరాయ్’ అనే ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీని సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం మరికొన్ని కథలను కూడా తేజ వింటున్నారట. ఈ నేపథ్యంలోనే పూరిజగన్నాథ్ దగ్గర కూడా ఒక కథ విన్నట్లు సమాచారం.

హనుమాన్ తో వచ్చిన ఇమేజ్ కి తగ్గట్లు కథలు ఎంచుకుంటూ వెళ్తున్న తేజ.. పూరీజగన్నాధ్ దగ్గర ఒక ఒక కథ విన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని సెట్ అయితే తేజ అండ్ పూరి దర్శకత్వంలో ఓ సినిమా ఉండబోతుందని ఫిలిం వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. హీరోలకు ప్రత్యేక క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసి సినిమా తెరకెక్కించే పూరి దర్శకత్వంలో నటిస్తే.. తేజ సజ్జకి హీరోగా సరికొత్త ఇమేజ్ రావడం పక్కా. అయితే ప్రస్తుత పూరి ఫార్మ్ లో లేరు. ప్లాప్స్ లో ఉన్న పూరితో తేజ సినిమా చేయడం అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. మరి ఈక్రమంలో ఈ కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో చూడాలి.

ప్రస్తుతం తేజ నటిస్తున్న ‘మిరాయ్’ సినిమా విషయానికి వస్తే.. వారియర్ బ్యాక్‌డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. కళింగ యుద్ధంతో రక్తపాతం సృష్టించిన అశోకుడిని యోగిగా మార్చిన ఒక గొప్ప గ్రంథాన్ని కాపాడే యోధుడిగా తేజ సజ్జ నటించబోతున్నారు. ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన టీజర్ ఆడియన్స్ కి గూస్‌బంప్స్ తెప్పించి మూవీ పై హైప్ ని క్రియేట్ చేసింది. ‘ఈగల్’ మూవీ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు.

Also read : Sudheer Babu : కొడుకు దరువు వేస్తుంటే.. పాట పాడి అదరగొట్టిన సుధీర్ బాబు..

  Last Updated: 14 May 2024, 01:46 PM IST