Mirai Manchu Manoj : మిరాయ్ నుంచి మంచు హీరో లుక్.. ప్రీ లుక్ పోస్టర్ షేక్ అయ్యేలా ఉంటే..!

Mirai Manchu Manoj హనుమాన్ తో సెన్సేషనల్ హిట్ అందుకున్న తేజా సజ్జా లీడ్ రోల్ లో ఈగల్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వస్తున్న సినిమా మిరాయ్.

Published By: HashtagU Telugu Desk
Teja Sajja Mirai Audio Rights Sold Big Price

Teja Sajja Mirai Audio Rights Sold Big Price

Mirai Manchu Manoj హనుమాన్ తో సెన్సేషనల్ హిట్ అందుకున్న తేజా సజ్జా లీడ్ రోల్ లో ఈగల్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వస్తున్న సినిమా మిరాయ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి ఈమధ్యనే వచ్చిన టైటిల్ టీజర్ భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. హనుమాన్ తర్వాత తేజా సజ్జాకి పర్ఫెక్ట్ సినిమా అని అనుకుంటున్నారు.

ఈ సినిమాలో తేజా సజ్జా తో పాటుగా మంచు మనోజ్ కూడా నటిస్తున్నాడని తెలిసిందే. సినిమాలో మంచు హీరో నెగిటివ్ రోల్ లో కనిపిస్తాడని టాక్. ఈ క్రమంలో మే 20న మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా సినిమా నుంచి మనోజ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారు. దానికి హింట్ ఇస్తూ ఒక బ్లాక్ ఖడ్గాన్ని చూపించారు.

కచ్చితంగా మంచు మనోజ్ ఈ సినిమాతో మళ్లీ తిరిగి ఫాంలోకి వచ్చేలా ఉన్నాడని చెప్పొచ్చు. మిరాయ్ సినిమా టీజర్ చూసి సినిమా బిజినెస్ కూడా ఒక రేంజ్ లో జరుగుతుందని తెలుస్తుంది. తేజా సజ్జా నుంచి మరో బ్లాక్ బస్టర్ మూవీ వచ్చేందుకు సిద్ధం అవుతుంది. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన మంచు మనోజ్ మిరాయ్ కథ నచ్చి ఓకే చేశాడు. ఈ సినిమా తప్పకుండా మనోజ్ కి మంచి కం బ్యాక్ ఇస్తుందని చెప్పుకుంటున్నారు.

  Last Updated: 17 May 2024, 11:52 PM IST