Mirai : ‘హనుమాన్’ వంటి సూపర్ హీరో బ్లాక్ బస్టర్ తరువాత తేజ సజ్జ చేస్తున్న మరో పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని అఫీషయల్ గా అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన టీజర్ ఆడియన్స్ ని థ్రిల్ చేసింది. తేజ సజ్జ సూపర్ యోధగా కనిపించబోతున్న ఈ సినిమాలో మంచు మనోజ్ సూపర్ విలన్ గా కనిపించబోతున్నాడు అంటూ తెలియజేసి ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేసారు.
ఇక తాజాగా మంచు మనోజ్ ఒక సీక్రెట్‌ని లీక్ చేసి ఆ ఆసక్తిని మరింత పెంచేశారు. నేడు మనోజ్ పుట్టినరోజు కావడంతో.. మూవీ నుంచి తన పాత్ర గ్లింప్స్ ని గ్రాండ్ గా ఈవెంట్ పెట్టి రిలీజ్ చేసారు. ఇక ఈ ఈవెంట్ లో పాల్గొన్న మనోజ్ మాట్లాడుతూ.. “దాదాపు ఎనిమిదేళ్లు సినిమాకి దూరంగా ఉన్నాను. మూడేళ్ళ క్రిందట మళ్ళీ రీ ఎంట్రీ ఇద్దామని అనుకున్న తరువాత, కథలు వినడం స్టార్ట్ చేశాను. కానీ ఏ కథ నన్ను పెద్దగా ఆకట్టుకోలేదు. అప్పుడే తేజ సజ్జ కలిసి ఒక కథ వినాలని కోరాడు. అది విన్న నాకు వెంటనే చేయాలని అనిపించి ఓకే చెప్పేసాను. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. మొదటి భాగం ఏప్రిల్ 2025 18న విడుదల కానుంది” అంటూ చెబుతూ మిరాయ్ రెండు భాగాలుగా రాబోతుందనే సీక్రెట్ ని రివీల్ చేసేసారు.
నిరాశపడ్డాను…. వేచి చూశాను…
ఓపిక విలువ తెలుసుకున్నాను….అప్పుడు వచ్చాడు ‘ కార్తీక్ ఘట్టమనేని ‘… #MIRAI తో…
సినిమా రెండు Parts లో వస్తుంది. First part releasing on 18 April, 2025.
– #ManchuManoj pic.twitter.com/6XtiFrzt0s
— Gulte (@GulteOfficial) May 20, 2024
కాగా సినిమా కథ.. అశోకుడు రహస్య తొమ్మిది పుస్తకాల నేపథ్యంలో ఉండబోతుంది. ఆ తొమ్మిది పుస్తకాల కలయిక అయిన ఒక మా గ్రంధాన్ని సంరక్షించే యోధుడిగా తేజ సజ్జ నటిస్తుంటే మంచు మనోజ్ దానిని దక్కించుకునే విలన్ గా కనిపించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది.