Site icon HashtagU Telugu

Teja Sajja : సినీ ప్రియులకు భారీ షాకింగ్.. మిరాయ్ సినిమా ధరలు పెంపు!

Teja Sajja

Teja Sajja

Teja Sajja : కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా, మంచు మనోజ్ హీరోలుగా తెరకెక్కిన ‘మిరాయ్’ సినిమా సెప్టెంబర్ 12న విడుదల కానుంది. అయితే, ఈ సినిమా టిక్కెట్ ధరలు పెంచేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారంటూ ఇటీవల సోషల్ మీడియాలో వదంతులు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై హీరో తేజ సజ్జా స్పందిస్తూ, ‘మిరాయ్’ సినిమా టిక్కెట్ ధరలు పెంచడం లేదని స్పష్టం చేశారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Revanth Reddy : కాంగ్రెస్ ఎంపీలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్..ఎక్కడంటే?

హనుమాన్ తర్వాత మిరాయ్‌గా తేజ సజ్జా..

‘మిరాయ్’ ఒక పాన్-ఇండియా చిత్రం. ఇది ఇప్పటికే ట్రైలర్, పాటల ద్వారా మంచి హైప్ క్రియేట్ చేసింది. తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మంచు మనోజ్ ‘బ్లాక్ స్వార్డ్’ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. శ్రియా శరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. చిన్నప్పుడు తేజ సజ్జా నటించిన ‘నువ్వు నేను’, ‘ఇంద్ర’, ‘ఠాగూర్’ వంటి చిత్రాల్లో శ్రియ హీరోయిన్‌గా చేశారు. ఇప్పుడు తేజ సజ్జాకు తల్లిగా నటిస్తుండటం ఈ సినిమాకు మరింత ఆకర్షణగా మారింది.

ఈ సినిమాకు భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, టిక్కెట్ ధరలు పెంచుతారనే వార్తలు అభిమానులను ఆందోళనకు గురిచేశాయి. ఈ నేపథ్యంలో వైజాగ్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తేజ సజ్జా మాట్లాడుతూ, “మేం ఈ సినిమాను ఎంతో కష్టపడి చేశాం. ఇది అందరికీ చేరువవ్వాలనే ఉద్దేశంతో టిక్కెట్ ధరలు పెంచడం లేదు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్, డిస్ట్రిబ్యూటర్లను ఒప్పించి మరీ ఈ నిర్ణయం తీసుకున్నాం” అని తెలిపారు. ఈ ప్రకటనతో వదంతులకు తెరపడింది. సాధారణ టిక్కెట్ ధరలతోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Vice President Election : ఉపరాష్ట్రపతి ఎన్నిక.. పార్లమెంట్ భవన్‌‌కు చేరుకున్న రాహుల్, ప్రియాంక, ఖర్గే