Teja Sajja Dulquer Salman Manchu Manoj హనుమాన్ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న తేజా సజ్జ తన నెక్స్ట్ సినిమాల ప్లానింగ్ తో సర్ ప్రైజ్ చేస్తున్నాడు. ఆల్రెడీ కామెడీ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తూ వస్తున్న నక్కిన త్రినాథ రావు డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడని తెలుస్తుండగా లేటెస్ట్ గా మరో బిగ్ మూవీ చేజిక్కించుకున్నాడు తేజా సజ్జ.
We’re now on WhatsApp : Click to Join
ఈగల్ సినిమా డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తేజా సజ్జ ఓ సినిమా రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఆల్రెడీ ఇదే డైరెక్టర్ తో ఈగల్ సినిమా చేసిన ఈ నిర్మాతలు డైరెక్టర్ మీద సూపర్ కాన్ ఫిడెంట్ తో ఉన్నారు.
ఇక ఇదిలాఉంటే తేజా సజ్జ తో పాటుగా ఈ సినిమాలో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. తెలుగులో మహానటి, సీతారామం ఇలా చేసిన రెండు సినిమాలు సూపర్ హిట్ కాగా దుల్కర్ సెలెక్ట్ చేసుకున్న సినిమా అంటే అది సూపర్ హిట్ అనే టాక్ ఉంది.
ఇక మరోపక్క ఇదే సినిమాలో మంచు మనోజ్ కూడా విలన్ గా చేస్తాడని టాక్. తేజా సజ్జ హీరో ఏంటి మంచు మనోజ్ విలన్ ఏంటని అనుకోవచ్చు కథ బాగా రావడంతో మంచు మనోజ్ విలనిజం నెక్స్ట్ లెవెల్ లో ఉండేలా ప్లాన్ చేశారట.
Also Read : Allu Snehareddy : ఆ హీరోయిన్ తో నటించకూడదంటూ.. భర్తకి కండిషన్ పెట్టిన అల్లు స్నేహారెడ్డి!
అందుకే మంచు మనోజ్ ఈ సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. సో తేజా సజ్జ, దుల్కర్ సల్మాన్, మంచు మనోజ్ ఈ ముగ్గురు కలిసి చేసే ఈ మల్టీస్టారర్ మూవీ ఈ ఇయర్ రాబోతున్న భారీ మల్టీస్టారర్ సినిమా అని చెప్పొచ్చు. ఈ సినిమా విషయంలో మేకర్స్ భారీ ప్లానింగ్ తో ఉన్నారని తెలుస్తుంది. మరి సినిమా కథ ఏంటి సినిమా ఎలాంటి జోనర్ లో వస్తుంది అన్నది తెలియాల్సి ఉంది.