Teja Sajja సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబోలో వస్తున్న గుంటూరు కారం సినిమా ఈ నెల 12న సంక్రాంతికి కానుకగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తో పాటుగా అదే రోజున హనుమాన్ సినిమా వస్తుంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన హనుమాన్ సినిమా ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో మూవీగా క్రేజ్ తెచ్చుకుంది. సినిమాలో తేజా సజ్జ లీడ్ రోల్ గా నటిస్తుంది. హనుమాన్ సినిమా మహేష్ గుంటూరు కారం కి పోటీగా వస్తుంది.
We’re now on WhatsApp : Click to Join
దీనిపై క్లారిటీ ఇచ్చాడు హనుమాన్ హీరో తేజా సజ్జ. మహేష్ యువరాజు సినిమాలో మహేష్ తనయుడిగా నటించిన తేజా సజ్జా ఇన్నేళ్లకు మళ్లీ ఆయన సినిమాతో పోటీ పడుతున్నారు. మహేష్ తో పోటీపై తేజా సజ్జా చాలా క్లవర్ గా ఆన్సర్ ఇచ్చాడు. మహేష్ సార్ తో పోటీగా కాదు మహేష్ తో కలిసి వస్తున్నాం అని అన్నాడు తేజా సజ్జా. ఈ ఆన్సర్ తో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఖుషి అవుతున్నారు.
ప్రశాంత్ వర్మ కూడా హనుమాన్ సినిమా రిలీజ్ నాడు వస్తున్న గుంటూరు కారం సినిమానే తాను కూడా ముందు చూస్తానని అన్నారు. సో మహేష్ కు పోటీ వస్తూనే సూపర్ స్టార్ సినిమానే తమ మొదటి ప్రియారిటీగా చెబుతున్నారు హనుమాన్ యూనిట్. ఇదంతా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి బాగా నచ్చేస్తుంది. హనుమాన్ సినిమా ట్రైలర్ సినిమాపై మంచి బజ్ ఏర్పరచుకుంది. ప్రశాంత్ వర్మ సినిమాలు ఎప్పుడు ఆడియన్స్ ని డిజప్పాయింట్ చేయలేదు కాబట్టి హనుమాన్ మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read : Thalapathy Vijay GOAT : విజయ్ GOAT ఆ హాలీవుడ్ సినిమా ఫ్రీమేకా..?