Site icon HashtagU Telugu

Teja : తేజ కొత్త సినిమాకు టైటిల్ అదేనా..?

Teja New Movie Title Fix

Teja New Movie Title Fix

సీనియర్ డైరెక్టర్ (Director) తేజ తన నెక్స్ట్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారని తెలుస్తుంది. తేజ తన తనయుడిని హీరోగా చేస్తూ ఒక సినిమా చేసే ప్లానింగ్ లో ఉన్నారు. ఈ సినిమాకు టైటిల్ కూడా లాక్ చేశారని టాక్. తేజ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా హనుమంతు అని పెట్టబోతున్నారట. ఫాంటసీ కథతో ఈ సినిమా రాబోతుందని టాక్.

తేజ (Teja) నేనే రాజు నేనే మంత్రి తర్వాత సక్సెస్ అందుకోలేదు. రెండేళ్ల క్రితం దగ్గుబాటి అభిరాం తో చేసిన అహింస కూడా నిరాశ పరచింది. అందుకే కాస్త టైం తీసుకుని తన కొత్త సినిమా పనుల్లో బిజీ అయ్యారు తేజ. ఈ క్రమం లో ఆ సినిమాకు టైటిల్ గా హనుమంతు అని లాక్ చేశారట.

అహింస కూడా నిరాశ పరచడంతో..

ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజా సజ్జ హీరోగా హనుమాన్ సినిమా వచ్చింది. ఆ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు హనుమంతు (Hanumanthu) అంటూ తేజా డైరెక్షన్ లో సినిమా వస్తుంది. మరి ఈ హనుమంతు ఆ హనుమాన్ రేంజ్ లో ఉంటుందా లేదా అన్నది చూడాలి. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా తేజ సినిమా సెట్స్ మీద ఉన్నప్పుఏ ప్రమోషన్స్ బాగుంటాయి.

అందుకు తగినట్టుగానే మ్యూజిక్, టీజర్, ట్రైలర్ ఉంటాయి. ఈసారి తేజ పర్ఫెక్ట్ కాలిక్యులేషన్స్ తో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. మరి తేజాని హనుమంతు తిరిగి ఫాం లోకి తెస్తారా లేదా అన్నది చూడాలి.

Also Read : NTR : తమిళ దర్శకుడికి ఎన్టీఆర్ ఓపెన్ ఆఫర్..!