టాలీవుడ్ యాక్టర్ తరుణ్(Tarun).. చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించి తెలుగు ఆడియన్స్ లో మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు. ఇక ఆ తరువాత హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన మొదటి సినిమా ‘నువ్వే కావాలి’తో(Nuvve Kavali).. రికార్డుల వర్షం కురిపించి బెస్ట్ డెబ్యూట్ అందుకున్నారు. అయితే ఈ సినిమాలో హీరోగా చేయాల్సింది తరుణ్ కాదు. ఆ అదృష్టం ముందుగా అక్కినేని హీరోని వరించింది. కానీ ఆ హీరో మిస్ చేసుకోవడంతో తరుణ్ కి కలిసొచ్చింది. ఇంతకీ ఆ హీరో ఎవరు..?
నాగార్జున తరువాత అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో ‘సుమంత్’. 1999లో రిలీజ్ అయిన ‘ప్రేమ కథ’ సినిమాతో సుమంత్ హీరోగా పరిచయం అయ్యారు. ఆ తరువాత సంవత్సరం యువకుడు, పెళ్లి సంబంధం వంటి సినిమాల్లో నటించారు. ఈ సినిమాలు చేస్తున్న సమయంలోనే ‘నువ్వే కావాలి’ అవకాశం సుమంత్ వద్దకి వచ్చింది. అయితే ఆ రెండు సినిమాలతో బిజీగా ఉన్న సుమంత్.. నువ్వే కావాలికి డేట్స్ ఇవ్వలేకపోయారు. దీంతో ఆ ఛాన్స్ తరుణ్ వద్దకి వెళ్ళింది.
కాగా ‘నువ్వే కావాలి’ సినిమా మలయాళ మూవీకి రీమేక్ గా వచ్చింది. 1999లో రిలీజైన మలయాళ మూవీ ‘నిరం’ సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఆ చిత్రాన్ని తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రీమేక్ చేశారు. తెలుగులో విజయ్ భాస్కర్ ఈ సినిమాని డైరెక్ట్ చేయగా.. త్రివిక్రమ్ మాటలు అందించారు. కోటి ఈ సినిమాకి సంగీతం అందించారు. 2000 అక్టోబర్ లో రిలీజైన ఈ చిత్రం.. బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకొని 20 స్క్రీన్స్ లో 200 డేస్ ఆడింది. 1.2 కోట్లతో తీసిన ఈ చిత్రం 28 కోట్లకు పైగా కలెక్షన్స్ ని కొల్లగొట్టి ఆ ఇయర్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ అయిన వెంకటేష్ ‘కలిసుందాం రా’ రికార్డులను బ్రేక్ చేసింది. నిజం చెప్పాలంటే ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అంతేకాదు బెస్ట్ తెలుగు ఫీచర్ ఫిలిం క్యాటగిరీలో నేషనల్ అవార్డుని సొంతం చేసుకుంది.
Also Read : NTR : ఎన్టీఆర్ మీ ఇంటికి వస్తే.. ఇలా వంట చేసి భోజనం పెట్టండి..