Tarun Bhaskar Keeda Cola Trailer పెళ్లిచూపులు సినిమాను డైరెక్ట్ చేసిన తరుణ్ భాస్కర్ ఆ ఒక్క సినిమాతోనే తన టాలెంట్ ఏంటన్నది చూపించాడు. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది చేశాడు. అది కూడా యూత్ ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. డైరెక్షన్ మాత్రమే కాకుండా యాక్టర్ గా కూడా తరుణ్ భాస్కర్ (Tarun Bhaskar) దూసుకెళ్తున్నాడు. లేటెస్ట్ గా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో కీడా కోలా అనే సినిమా వస్తుంది. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేశారు.
కీడా కోలా ట్రైలర్ లో కూల్ డ్రింక్ లో బొద్దింకని చూపించిన డైరెక్టర్ సినిమాలో చాలా పాత్రలు వాటి స్వభావాలు అల్లరి అంతా బాగా చూపించాడు. సినిమాలో తరుణ్ భాస్కర్ కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలో బ్రహ్మానందం (Brahmanandam) కూడా ఉన్నారు. ట్రైలర్ అయితే ఆసక్తికరంగా ఉంది.
Also Read : Japan Teaser : కార్తీ జపాన్ టీజర్ చూశారా? దీపావళికి సరికొత్త బ్లాస్ట్..
తరుణ్ భాస్కర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతను ఎప్పుడు తన సినిమాలతో నిరాశపరచడు. కీడా కోలా (Keeda Cola) ట్రైలర్ ఇంప్రెస్ చేయగా సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందని ఆడియన్స్ నమ్ముతున్నారు. నవంబర్ 4న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. కీడా కోలాతో తరుణ్ మరో వండర్ క్రియేట్ చేశాడా లేదా అన్నది చూడాలి.
డైరెక్షన్ తో పాటుగా నటించడం కూడా చేస్తూ తెలుగు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు తరుణ్ భాస్కర్. కీడా కోలా తన మార్క్ ఎంటర్టైనింగ్ మూవీగా ఆడియన్స్ ని అలరిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు.