తారకరత్న భార్య అలేఖ్య (Alekhya Nandamuri) ఎమోషనల్ అయ్యింది. తారకరత్న (Taraka Ratna) మరణించి నేటికీ సరిగ్గా ఏడాది అవుతుంది. భార్యాబిడ్డలతో సంతోషంగా ఉన్న తారకరత్న .. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుకు గురైయ్యాడు. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం బెంగుళూరుకు తరలించి చికిత్స అందించారు. కొద్దీ రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి 2023 ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు.
RRR : పులివెందుల ఇంచార్జ్ గా రఘురామకృష్ణంరాజు ..?
తారకరత్న చనిపోయిన దగ్గరనుంచి అలేఖ్య ఎంతో వేదనను అనుభవిస్తుంది. నిత్యం భర్తను తలుచుకొని సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ వస్తుంది. ఈరోజు కూడా అలాగే ఎమోషనల్ ట్వీట్ చేసింది. ” విధి నిన్ను మా నుండి దూరం చేసిన రోజున ఈ లోకంలో ఏదీ పూరించదు.. నిన్ను కోల్పోయిన బాధ.. కాలం మాన్పలేని గాయం, ఏదీ భర్తీ చేయలేని హృదయ విదారకం.. మేం ఇలా విడిపోవాలని ఎప్పుడూ అనుకోలేదు… నువ్వు ఇక్కడ లేకపోవచ్చు కానీ. నీ ఉనికి మా జీవితాల్లో, నువ్వు విడిచిన కలల్లో, మసకబారడానికి నిరాకరించే ప్రేమలో.. మాటలకు మించి, కాలాన్ని దాటి, జీవితానికి మించి ఉంటుంది.. నిన్ను మిస్ అవుతున్నాం..” అంటూ ఎమోషనల్ అయ్యింది.
తారకరత్న ఫోటో వద్ద నివాళులు అర్పించి.. కొన్ని ఫోటోలను షేర్ చేసింది అలేఖ్య. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు తండ్రికి నివాళులు అర్పిస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.