Tarakaratna Love Letter: వైరల్ అవుతున్న తారకరత్న లవ్ లెటర్..

నందమూరి తారకరత్న మరణంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.

Published By: HashtagU Telugu Desk
Tarakaratna Love Letter Is Going Viral..

Tarakaratna Love Letter Is Going Viral..

ఫిబ్రవరి 18న నందమూరి తారకరత్న (Tarakaratna) మరణంతో యావత్ సినీ లోకంలో విషాదం అలుముకుంది. మంచి భవిష్యత్ ఉన్న ఆయన మృతి చెందడం ఏ ఒక్కరు జీర్ణించుకోలేక పోతున్నారు. నందమూరి కుటుంబ అయితే ఒక్కసారిగా కుంగిపోయింది. ఈ నేపథ్యంలో తారకరత్న లవ్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తారకరత్న (Tarakaratna) రాసిన ఈ లవ్ లెటర్ ని తన సోషల్ మీడియా ఖాతాలో స్వయంగా పోస్ట్ చేస్తూ ఎమోషనల్ మెసేజ్ రాసింది అలేఖ్య రెడ్డి. తారకరత్న పెద్ద కర్మ రోజున తన భర్త జ్ఞాపకాలతో తీవ్ర భావోద్వేగం చెందిది అలేఖ్య రెడ్డి. తన భర్తతో గడిపిన ఆ క్షణాలను మరచిపోలేక పోతోంది అలేఖ్య రెడ్డి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఎంత ఓదార్చినా కూడా కంటతడి పెట్టుకోవడం ఆపడం లేదట. ఈ నేపథ్యంలో తన భర్త తారకరత్న రాసిన లవ్ లెటర్ పంచుకుంటూ ఎమోషనల్ అయింది.

భార్యను బంగారు తల్లి అంటూ తారకరత్న (Tarakaratna) రాసిన ఈ లెటర్ చూస్తుంటే ఆ ఇద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉందనేది అర్థమవుతోంది. భార్య అంటే తనకు ఎంత ప్రేమో చాలా గొప్పగా చెబుతూ తారకరత్న రాసిన పదాలు అందరి చేత కంటతడి పెట్టిస్తున్నాయి. నాకున్నది నువ్వు మాత్రమే, నువ్వంటే నా ప్రపంచం బంగారం అంటూ తన భార్యకు వాలైంటన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు తారకరత్న. ఆయన రాసిన ఆ లేఖ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. భార్యతో ఆయన బలమైన బంధాన్ని స్పష్టం చేస్తోంది. ఈ లెటర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అలేఖ్య రెడ్డి తన ఫీలింగ్స్ తెలుపుతూ మెసేజ్ పెట్టింది. ”మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. జీవితంలో అత్యంత క్లిష్ట పరిస్థితులను, ఎత్తుపళ్లాలు చూశాం. అయినప్పటికీ నువ్వు, నేను కలిసి ఇంత దూరం ప్రయాణించాం. ఎన్ని కష్టాలు ఎదురైనా మనం నమ్మకం కోల్పోకుండా మంచి రోజుల కోసం ఎదురు చూశాం” అని పేర్కొంది.

మన కోసం ఓ చిన్న కుటుంబాన్ని సృష్టించుకున్నాం. నువ్వేంటనేది ఎవ్వరికీ తెలీదు. నిన్ను ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. నేను అర్థం చేసుకున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. బాధలన్నింటినీ నీలోనే దాచేసుకుని మాకు మాత్రం గొప్పగా ప్రేమను పంచావు. మన చుట్టూ ఉన్నవాళ్లు ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పినా పట్టించుకోకుండా మరింత ఎత్తుకు ఎదుగుతా నాన్న. ఈ రోజు నిన్ను ఎంతో మిస్ అవుతున్నా నాన్న అంటూ బాధ హృదయంతో పోస్ట్ పెట్టింది అలేఖ్య రెడ్డి. అంతకుముందు తారకరత్నతో (Tarakaratna) చివరి జ్ఞాపకాన్ని పంచుకుంటూ చాలా బాధపడింది అలేఖ్య రెడ్డి. ఇదే మా చివరి ఫోటో అని తలుచుకుంటుంటే నా గుండె ముక్కలవుతోంది అంటూ తిరుమల వెళ్లిన ఫోటోని సోషల్ మీడియాలో పంచుకుంది. తారకరత్నను ప్రేమించి పెళ్లి చేసుకున్న అలేఖ్య రెడ్డి.. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆయనకు అండగా ఉండేదట. అనుక్షణం ప్రేమిస్తూ భర్త అడుగుజాడల్లో నడిచేదట. అయితే ఊహించని విధంగా భర్త దూరం కావడంతో ఆమె దుఃఖాన్ని ఆపడం ఎవరితరం కావడం లేదు.

Also Read:  5G vs 4G: 4జీ కంటే 5జీ విస్తరణ ఖర్చు తక్కువే అవుతుందట.. ఎలాగంటే?

  Last Updated: 03 Mar 2023, 11:10 AM IST