Nandamuri Balakrishna : నేను టీడీపీ వైపే ఉన్నాను.. వైసీపీ వైపు కాదు.. తారకరత్న భార్య పోస్టు..

తారకరత్న భార్య అలేఖ్య తన సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్ వేశారు. నేను టీడీపీ వైపే ఉన్నాను, వైసీపీ వైపు కాదు..

Published By: HashtagU Telugu Desk
Taraka Ratna Wife Alekhya Reddy Post About Nandamuri Balakrishna Tdp

Taraka Ratna Wife Alekhya Reddy Post About Nandamuri Balakrishna Tdp

Nandamuri Balakrishna : నందమూరి తారకరత్న గత ఏడాది మరణించిన సంగతి తెలిసిందే. ఇక ఆయన మరణం అనంతరం తారకరత్న కుటుంబ బాధ్యతని బాలకృష్ణ తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. ఏదో నలుగురు ముందు మాట ఇచ్చినందుకు.. ఆ కుటుంబానికి కావాల్సిన అవసరాలు తీర్చడం కాకుండా, దగ్గరుండి వారి మంచి చెడ్డలు తెలుసుకుంటూ, వారికీ తాను ఉన్నానన్న ధైర్యాన్ని, నమ్మకాన్ని బాలయ్య ఇస్తూ వస్తున్నారు.

ఈక్రమంలోనే వారిని అప్పుడప్పుడు కలుసుకుంటూ, ఆ కుటుంబంతో కొంత సమయం గడుపుతూ తన గొప్ప మనసుని చాటుకుంటున్నారు. తాజాగా కూడా బాలయ్య తన కుమారుడు మోక్షజ్ఞతో కలిసి తారకరత్న కుటుంబాన్ని కలుసుకున్నారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలను తారకరత్న భార్య అలేఖ్య షేర్ చేస్తూ.. పొలిటికల్ గా ఓ విషయం పై క్లారిటీ ఇచ్చేసారు.

వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డికి అలేఖ్య బంధువు అన్న విషయం అందరికి తెలిసిందే. ఈమధ్య ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రానున్న ఎన్నికల్లో అలేఖ్య.. విజయ సాయిరెడ్డికి సపోర్ట్ గా ఉండనున్నారనే వార్త నెట్టింట వైరల్ అవ్వడంతో.. నందమూరి అభిమానులు కొంత ఆందోళన చెందారు.

ఇక ఈ విషయం పైనే అలేఖ్య క్లారిటీ ఇస్తూ ఇలా రాసుకొచ్చారు.. “నాకు ప్రతిసారి ఓ ప్రశ్న ఎదురవుతుంది. నేను ఏ వైపు ఉన్నానని, నన్ను ప్రతిసారి అడుగుతూ వస్తున్నారు. దానికి నా జవాబు ఏంటంటే.. మానవత్వం, ప్రేమ ఉన్న వైపు ఉన్నాను, మాతో కలిసి ఉన్నవారు వైపు ఉన్నాను, నా కుటుంబం వైపు ఉన్నాను. మావయ్య (బాలకృష్ణ).. నేను, ఓబు మరియు పిల్లలు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాము. రానున్న రోజుల్లో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను” అంటూ రాసుకొచ్చారు.

ఈ పోస్టుతో అలేఖ్య.. “నేను టీడీపీ వైపే ఉన్నాను. వైసీపీ వైపు కాదు” అని ఓ క్లారిటీ ఇచ్చేసారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

  Last Updated: 20 Apr 2024, 12:41 PM IST