Tapsee pannu : అందాల భామ తాప్సీ తన పదేళ్ల ప్రేమ జర్నీని పెళ్లిగా మార్చేసుకున్నారు. ఇన్నాళ్లు డెన్మార్క్ కి చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయ్ (Mathias Boe) తో కలిసి తిరుగుతూ వచ్చిన తాప్సీ.. తన ప్రేమ విషయాన్ని ఎప్పుడు అధికారికంగా ప్రకటించలేదు. కానీ మథియాస్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ వచ్చేవారు. ఇక ఇన్నాళ్లు డేటింగ్ చేస్తూ వచ్చిన ఈ జంట.. కొన్ని రోజుల క్రిత్రం ఏడడుగులు వేశారు.
మార్చి 23న ఉదయ్ పూర్ లోని ఓ హోటల్ లో వీరి పెళ్లి చాలా సింపుల్ గా జరిగిపోయింది. ఇరు కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మధ్య చాలా రహస్యంగా తాప్సీ పెళ్లి చేసేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఏ ఫోటో, వీడియో బయటకి రాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే తాజాగా ఓ వీడియో బయటకి వచ్చింది. ఆ వీడియోలో తాప్సీ పెళ్లి వేదిక దగ్గరికి డాన్స్ వేస్తూ వస్తూ కనిపిస్తున్నారు.
పెళ్లి వేదిక పై దండలు మార్చుకుంటున్న సమయంలో కూడా తాప్సీ డాన్స్ వేస్తూ తన సంతోషాన్ని బయటకి వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇక తాప్సీ, మథియాస్ దండలు మార్చుకుంటున్న సమయంలో అతిథులు వారి పై పూలవర్షం కురిపించి ఆశీర్వదించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇది చూసిన ఆడియన్స్.. తాప్సీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కాగా తాప్సీ తెలుగు సినిమాలతోనే నటిగా కెరీర్ స్టార్ట్ చేసారు. అయితే ఇక్కడి మేకర్స్ ఈ అమ్మడిని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో బాలీవుడ్ వెళ్లిపోయిన ఈ భామ.. అక్కడ వరుస అవకాశాలు అందుకుంటూ వచ్చారు. రీసెంట్ గా షారుఖ్ ఖాన్ ‘డంకీ’ సినిమాలో హీరోయిన్ గా నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.
Also read : Vijay Deverakonda – Rashmika : ఇన్‌స్టా స్టోరీలతో మళ్ళీ దొరికిపోయిన విజయ్, రష్మిక..