ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaja) చేసిన వ్యాఖ్యలు చిత్రసీమలోనే కాదు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రీమియర్ షో (Premiere Show)లకు సంబంధించి ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి ప్రత్యేక అనుమతులు కోరడం అనైతికమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రీమియర్ షోల కోసం ముఖ్యమంత్రులను ఆశ్రయించడం కరెక్ట్ కాదని, ఇది ప్రజలపై అదనపు భారం కలిగించే పరిస్థితికి దారితీస్తుందని తెలిపారు. “గతంలో ప్రీమియర్ షోలను ఉచితంగా ప్రదర్శించేవాళ్లం. కానీ ఇప్పుడు వాటికి టికెట్లు (Movie Tickets) పెట్టి పెద్ద మొత్తంలో డబ్బు ఆర్జిస్తున్నారు. ఇది ఒక వ్యాపార మాదిరిగా మారిపోయింది. ఇటువంటి చర్యల వల్ల ప్రజలకు అనవసరంగా అదనపు భారం పడుతోంది” అని వ్యాఖ్యానించారు.
రూ.100 కోట్ల కలెక్షన్లు తగ్గితే చిత్రపరిశ్రమకు అంతటి పెద్ద నష్టమేమీ ఉండదని తమ్మారెడ్డి స్పష్టం చేశారు. చిత్రపరిశ్రమ మొత్తం కలెక్షన్ల కోసం పరుగులు పెట్టడం వల్ల అసలుకే నష్టం కలుగుతోంది. ముఖ్యంగా ప్రేక్షకులపై అదనపు భారం వేయడం సరికాదు, దీనిపై అందరూ ఆలోచించాలి” అని సూచించారు. ప్రీమియర్ షోల వల్ల అందరికీ లాభాలే ఉంటాయని భావించే వారిపై కూడా తమ్మారెడ్డి విమర్శలు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికే అనేక రకాల ఇబ్బందులు , భారాలు మోస్తున్నారు. ఇప్పుడు మీము కూడా ప్రజలపై టిక్కెట్ల భారం మోపడం అనవసరం అన్నారు. ప్రజల అవసరాలను, వారి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
Read Also : AP Govt : 108, 104 ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్