Vijay : విజయ్ అభిమానులకు షాక్ ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వం.. అవన్నీ క్యాన్సిల్..

సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయితే బెనిఫిట్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోలు ఉంటాయి. తమిళనాడులో కూడా విజయ్ లియో సినిమాకు పొద్దున్నే 4 గంటలకు, 7 గంటలకు షోలు కావాలని గవర్నమెంట్ ని అడిగారు.

Published By: HashtagU Telugu Desk
Tamilnadu Government Restrictions on Vijay Leo Movie

Tamilnadu Government Restrictions on Vijay Leo Movie

తమిళ్ స్టార్ హీరో విజయ్(Vijay) కి అక్కడ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. విజయ్ సినిమా వస్తే థియేటర్స్ వద్ద పండగే. విజయ్ ఇప్పుడు దసరా కానుకగా అక్టోబర్ 19న లియో(Leo) సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో లియో సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే పలు సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై మరిన్ని అంచనాలు పెంచారు.

అయితే సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయితే బెనిఫిట్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోలు ఉంటాయి. తమిళనాడులో కూడా విజయ్ లియో సినిమాకు పొద్దున్నే 4 గంటలకు, 7 గంటలకు షోలు కావాలని గవర్నమెంట్ ని అడిగారు. మొదట సానుకూలంగా స్పందించినా ఇప్పుడు కుదరదు అని షాక్ ఇచ్చారు.

తాజాగా తమిళ సినిమా శాఖ హోమ్ సెక్రెటరీ ప్రభుత్వం తరపున నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల ప్రకారం విజయ్ లియో సినిమాకు బెనిఫిట్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోలకు అనుమతి లేదు. ఎవరైనా వేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే రిలీజ్ రోజు థియేటర్స్ బయట ట్రాఫిక్ కి అంతరాయం కలిగించినా చర్యలు తీసుకుంటాం. పోలీసులు థియేటర్స్ ని విజిట్ చేస్తారు అని తెలిపారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఓపెనింగ్ రోజు రికార్డ్ కలెక్షన్స్ తో సరికొత్త రికార్డ్ సెట్ చేయాలి అనుకున్న ఫ్యాన్స్ కి నిరాశ ఎదురైంది.

 

Also Read : Pooja Hegde : మాల్దీవ్స్ బీచ్‌లలో బర్త్ డేని బాగా ఎంజాయ్ చేసిన పూజాహెగ్డే..

  Last Updated: 15 Oct 2023, 10:31 AM IST