Rajinikanth: రజనీకాంత్ హిట్ చిత్రం ముత్తు రీరిలీజ్, ఫ్యాన్స్ కు పండుగే!

Rajinikanth: ప్రస్తుతం దేశంలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగులో ఎన్నో హిట్ చిత్రాలు రీరిలీజ్ అయ్యి కలెక్షన్ల వర్షం కురిపించాయి. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కెరియర్‌లో సూపర్ హిట్ చిత్రాలలో ముత్తు మూవీ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. . ఇక ఈ చిత్రం డిసెంబర్ 2 న రీ రిలీజ్ అవుతుండంతో ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో 1995 లో విడుదలైన ముత్తులో రజనీకాంత్ సరసన […]

Published By: HashtagU Telugu Desk
Some Railway Workers Help to Rajinikanth in his Studies Time

Some Railway Workers Help to Rajinikanth in his Studies Time

Rajinikanth: ప్రస్తుతం దేశంలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగులో ఎన్నో హిట్ చిత్రాలు రీరిలీజ్ అయ్యి కలెక్షన్ల వర్షం కురిపించాయి. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కెరియర్‌లో సూపర్ హిట్ చిత్రాలలో ముత్తు మూవీ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. . ఇక ఈ చిత్రం డిసెంబర్ 2 న రీ రిలీజ్ అవుతుండంతో ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో 1995 లో విడుదలైన ముత్తులో రజనీకాంత్ సరసన మీనా హీరోయిన్‌గా నటించింది. ఎ. ఆర్. రెహమాన్ సంగీత సారథ్యంలో అద్భుతమైన పాటలు నేటికి శ్రోతలను, తలైవా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అక్టోబరు 23, 1995 న విడుదలైన ఈ చిత్రం ఆనాడు సూపర్ హిట్ చిత్రంగా నిలవడమే కాకుండా బాక్స్ ఆఫీస్‌ను కలెక్షన్లతో షేక్ చేసింది.

తమిళనాడులోని చాలా థియేటర్లలో 175 రోజులు ఆడి అందరిని ఆశ్చర్యంలో ముచ్చెత్తింది. మన దగ్గర సంచలనం సృష్టించిన ముత్తు 1998 లో జపనీస్ భాషలో విడుదలై సంచలన విజయం అందుకుంది. దాంతో రజనీకాంత్ జపాన్ లో కూడా వీరాభిమానులను సంపాదించుకున్నారు. ఇటీవల జైలర్ మూవీతో హిట్ ట్రాక్ లోకి వచ్చిన రజనీ మరిన్ని సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు.

  Last Updated: 18 Nov 2023, 04:41 PM IST