Vijay : దిగజారిన తమిళ రాజకీయం.. స్టార్ హీరోకు తెలుగు డైరెక్టర్ తో సినిమా తీయొద్దని చెప్పారట..

తమిళ్ స్టార్ హీరో విజయ్ ఇప్పటికే తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లితో సినిమా చేసాడు.

Published By: HashtagU Telugu Desk
Tamil Star Hero Vijay Rejects Gopichand Malineni Film Due to Telugu Director

Gopichand Malineni

Vijay : ఇప్పుడు ఉన్న పాన్ ఇండియా ఊపులో అన్ని పరిశ్రమలు కలిసి పనిచేస్తున్నాయి. మన తెలుగు డైరెక్టర్స్ తమిళ్, హిందీ, మలయాళం.. అన్ని పరిశ్రమల హీరోలతో సినిమాలు చేస్తున్నారు. వేరే పరిశ్రమల హీరోలు కూడా తెలుగులో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ ఇప్పటికే తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లితో సినిమా చేసాడు.

ఈ క్రమంలో మరో తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేనికి కూడా ఒక చెప్పాడంట. తాజాగా గోపీచంద్ మలినేని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలయ్య వీరసింహ రెడ్డి సినిమా తర్వాత తమిళ్ స్టార్ విజయ్ గారితో సినిమా చేయాలని ప్రయత్నించాను. ఆయనకు కథ చెప్పాక సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేసారు. కానీ ఆయన రాజకీయాల్లోకి రావడంతో ఆయన చుట్టూ ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు ఇలాంటి టైంలో తెలుగు డైరెక్టర్ తో సినిమా వద్దు, ఆల్రెడీ ఒకసారి చేసారు, మళ్ళీ తెలుగు డైరెక్టర్ తో చేస్తే తమిళ్ వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని అంటారు, వేరే పార్టీ నేతలు విమర్శలు చేస్తారు అని విజయ్ కి చెప్పి నా సినిమా క్యాన్సిల్ చేయించారు. తెలుగు డైరెక్టర్ అయినందుకే నా సినిమా క్యాన్సిల్ చేయించారు అని చెప్పాడు.

దీంతో పలువురు తెలుగు సినిమా లవర్స్ విజయ్ పై, తమిళ రాజకీయ నాయకులపై విమర్శలు చేస్తున్నారు. సాధారణంగానే దేశం అంతా ఒకవైపు ఉంటే తమిళ రాజకీయ నాయకులు ఒకవైపు ఉంటారు. వాళ్ళ భాషని ప్రేమించడం వరకు ఓకే కానీ పక్క భాష మీద శత్రుత్వం చూపిస్తారు. ఆఖరికి ఇలా సినిమా విషయంలో కూడా తెలుగుకు చెందినవాడు అని వద్దన్నారంటే వాళ్ళ ఆలోచనలు ఎంత దిగజారాయో తెలుస్తుంది. రాజకీయం కోసం భాషా భేదాలు చూపించి ఏమైనా చేస్తారు అని మరోసారి తమిళ రాజకీయ నాయకులు చూపించారు.

ఇక గోపీచంద్ మలినేని ఇటీవలే బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ తో జాట్ సినిమా తీసి హిట్ కొట్టాడు. త్వరలో బాలయ్యతోనే మరో సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత జాట్ 2 చేయనున్నాడు.

 

Also Read : HariHara VeeraMallu : హమ్మయ్య.. పవన్ హరిహర వీరమల్లు అయిపోయినట్టే.. చివరి రెండు రోజులు.. ట్రైలర్ అప్డేట్ కూడా..

  Last Updated: 05 May 2025, 08:04 AM IST