Site icon HashtagU Telugu

Vijay : విజయ్‌ని హీరోగా పరిచయం చేయమంటే.. చేయనని మొహం మీద చెప్పేశాడట ఆ స్టార్ డైరెక్టర్..

Tamil Star Director Bharathiraja refused to Introduce Vijay as Hero

Tamil Star Director Bharathiraja refused to Introduce Vijay as Hero

తమిళ్ స్టార్ హీరో విజయ్(Vijay) ప్రస్తుతం సౌత్ లోనే అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోల్లో ఒకరిగా ఉన్నాడు. తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్న ఈ హీరోతో సినిమా తీసేందుకు చాలా మంది దర్శకులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. అయితే విజయ్ ని హీరోగా పరిచయం చేయమని మొదట ఒక స్టార్ డైరెక్టర్ ని కోరితే చేయనని మొహం మీద చెప్పేశాడట ఆ దర్శకుడు. ఆ దర్శకుడు మరెవరో కాదు.. తమిళ్ దిగ్గజ డైరెక్టర్ భారతిరాజా (Bharathiraja).

విజయ్ తండ్రి ఎస్‌ ఎ చంద్రశేఖర్‌ (S.A. Chandrasekhar) కూడా తమిళంలో పెద్ద దర్శకుడే. అయినా తన కొడుకుని హీరోగా లాంచ్ చేయమని భారతిరాజాని కోరాడట. అయితే భారతిరాజా ఆ విజ్ఞప్తిని వెంటనే తిరస్కరించి చేయనని చెప్పాడట. పైగా మీరే మీ తనయుడితో సినిమా ఎందుకు చేయకూడదని భారతిరాజా విజయ్ తండ్రికి సలహా ఇచ్చాడట. ఈ విషయాన్ని భారతిరాజా స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. అయితే ఎందుకు చేయనన్నాడో రీజన్ మాత్రం చెప్పలేదు.

ఇక ఆయన సలహాతో చంద్రశేఖర్‌ ‘నాలైయా తీర్పు’ (Naalaiya Theerpu) సినిమాతో విజయ్ ని హీరోగా లాంచ్ చేశాడు. ఆల్రెడీ విజయ్ ని బాలనటుడిగా వెండితెరకి కూడా చంద్రశేఖరే పరిచయం చేశాడు. తన దర్శకత్వంలో తెరకెక్కిన ‘వెట్రి’ (vetri) మూవీతో విజయ్‌ చైల్డ్ ఆర్టిస్ట్ గా తెరంగేట్రం చేశాడు.

ఇక 1992లో విడుదలైన ‘నాలైయా తీర్పు’ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చి మంచి సక్సెస్ అయ్యి విజయ్ కి మంచి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో విజయ్ మాత్రమే కాదు ఒక లేడీ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఎం ఎం కీరవాణి సోదరి శ్రీలేఖ (M M Srilekha) ఈ సినిమాతో సంగీత దర్శకురాలుగా పరిచయం అయ్యింది. ఆ తరువాత తెలుగు, తమిళంలో పలు సినిమాలకు మ్యూజిక్ అందించింది. రీసెంట్ గా హిట్ 2 సినిమాకి కూడా సంగీతం ఇచ్చింది శ్రీలేఖనే.

 

Also Read : Nandita Swetha : హీరోయిన్ నందిత శ్వేత ఆ వ్యాధితో బాధపడుతుందట.. పాపం.. అయినా సినిమా కోసం..