Captain Miller: ధనుష్ కొత్త సినిమా కెప్టెన్ మిల్లర్ వచ్చే డిసెంబర్ 15 విడుదలకు రెడీ అవుతోంది. హీరో పుట్టినరోజు సందర్భంగా సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకు టీజర్ వదిలారు. కాన్సెప్ట్ చూస్తే షాక్ ఇచ్చేలా ఉంది. స్వతంత్రం రాకముందు దేశం బ్రిటిష్ పాలన ఉన్న నాటి రోజుల్లో అడవికి దగ్గర్లో ఉండే ఒక మారుమూల గిరిజన తండా లాంటి ఊరు. హఠాత్తుగా వచ్చి మీద పడుతుంది ఇంగ్లీష్ సైన్యం. దానికి ఎదురొడ్డి నిలబడతాడు మిల్లర్(ధనుష్). ఒక విప్లవకారుడి మాదిరి వాళ్ళతో తలపడి విధ్వంసం సృష్టిస్తాడు.
అయితే తెల్లదొరలు దాడికి తెగబడేందుకు కారణం ఏంటి, ఇంతకీ మిల్లర్ అంటే నిజంగా మనం అనుకుంటున్న వ్యక్తా లేక మరొకరు ఉన్నారా అనేది సస్పెన్స్. విజువల్స్ మొత్తం రా అండ్ రస్టిక్ గా ఉన్నాయి. భారీగా యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేశారు. యాక్షన్ అవతార్‌లో ధనుష్ అద్భుతంగా ఉన్నాడు.
టీజర్‌లో ధనుష్ ఎక్స్‌ప్రెషన్స్ అయితే చాలా వైల్డ్‌గా ఉన్నాయి. టీజర్‌లో శివ రాజ్‌కుమార్, ప్రియాంక మోహన్, సందీప్ కిషన్, RRR ఫేమ్ ఎడ్వర్డ్ సోనెన్‌బ్లిక్ కూడా కనిపించారు. మొత్తానికి కథ రివీల్ చేయనప్పటికీ సూపర్ యాక్షన్ డ్రామాని రెడీ చేసినట్లు అర్థమవుతుంది. జీవీ ప్రకాశ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. తెలుగు హీరో సందీప్ కిషన్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు.
Also Read: Hyderabad to Vijayawada: భారీ వర్షాల ఎఫెక్ట్, TSRTC బస్సులు రద్దు