Dhanush New look: కొత్త లుక్ లో ధనుష్.. రామ్ దేవ్ బాబా అంటూ నెటిజన్స్ ట్రోల్స్!

తమిళ్ సూపర్ స్టార్ ధనుష్ కొత్త లుక్ లో కనిపించి అభిమానులను ఆశ్చర్యపర్చాడు.

Published By: HashtagU Telugu Desk
Dhanush

Dhanush

తమిళ్ (Tamil) హీరో ధనుష్ అనగానే వైవిధ్యమైన పాత్రలు కళ్ల ముందు కదలాడుతాయి. ఆయన నుంచి సినిమా వస్తుందంటనే అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఉత్సాహం చూపిస్తుంటారు. ఇటీవలనే సార్ సినిమాలో మధ్య తరగతి ఉపాధ్యాయుడిగా కనిపించి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఆయన తమిళ యాక్షన్-థ్రిల్లర్ కెప్టెన్ మిల్లర్ షూట్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం ధనుష్ ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు. ఆయన గుబురు గడ్డం, పొడవైన జుట్టుతో కనిపించి ఆశ్చర్యపర్చాడు. అయితే చాలామంది కొత్త లుక్ లో ధనుష్ ను గుర్తు పట్టలేకపోయారు.

ప్రస్తుతం ఆయన ఫొటోలు వైరల్ అవుతుండటంతో అభిమానులు, నెటిజన్స్ ఓ రేంజ్ లో రియాక్ట్ అయ్యారు. ధనుష్ (Dhanush) ను బాబారామ్ దేవ్ తో పోల్చి చూస్తున్నారు. ఎయిర్ పోర్ట్ లో కనిపించిన ధనుష్ జీన్స్, సన్ గ్లాసెస్‌తో ఊదా రంగు షర్ట్‌ని ధరించాడు. “సాధారణ దుస్తులు ధరించి బయటకు వచ్చిన ధనుష్ ను బాబా రామ్‌దేవ్ అని నేను అనుకున్నాను.” అని కొంతమంది అభిమానులు కామెంట్ చేయగా, అతని కొత్త అవతార్‌లో ఎలా గుర్తించారు? “బాబా రామ్‌దేవ్ అది నువ్వేనా?” అంటూ మరికొంతమంది కామెంట్స్ చేశారు.

అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన కెప్టెన్ మిల్లర్‌లో ధనుష్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. తండ్రి కొడుకులుగా కనిపించనున్నారు. కెప్టెన్ మిల్లర్‌తో పాటు, ధనుష్ (Dhanush) త్వరలో పెట్టని తమిళ చిత్రం కోసం దర్శకుడు మారి సెల్వరాజ్‌తో మళ్లీ పనిచేయనున్నారు. గత నెలలో ట్విట్టర్‌లోకి వెళ్లి ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు ధనుష్.

Also Read: Delhi Girl Murder: ఢిల్లీలో యువతి దారుణ హత్య, 20సార్లు కత్తితో పొడిచి చంపేసిన ప్రియుడు!

  Last Updated: 29 May 2023, 04:13 PM IST