Drug Trafficking Case: ఢిల్లీ పోలీసులు , నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి అంతర్జాతీయ డ్రగ్ నెట్‌వర్క్‌ను ఛేదించింది. ఈ డ్రగ్ మాఫియాలో తమిళనాడుకు చెందిన తమిళ సినీ నిర్మాత కీలక సూత్రధారిగా పోలీసులు గుర్తించారు . ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ డ్రగ్స్ నెట్ వర్క్ భారత్ , న్యూజిలాండ్ , ఆస్ట్రేలియా , మలేషియా దేశాలకు విస్తరించిందని పోలీసులు తెలిపారు . ఈ క్రమంలో ఢిల్లీలో ముగ్గురిని అరెస్టు చేశారు. వారి నుంచి 50 కిలోల సూడోపెడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హెల్త్ మిక్స్ పౌడర్, ఎండు కొబ్బరి వంటి ఆహార పదార్థాల ముసుగులో కొన్ని వస్తువుల ద్వారా అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.
గత మూడేళ్లలో మొత్తం 45 సరుకులు పంపారని , అందులో దాదాపు 3,500 కిలోల సూడోఎఫెడ్రిన్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ.2,000 కోట్ల కంటే ఎక్కువ ఉంటుందని తెలిపారు. అంతేకాదు మొత్తం నెట్‌వర్క్‌పై దాడి చేసేందుకు ఆ దేశాల్లోని నిందితులను అరెస్ట్ చేసేందుకు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అధికారులను సంప్రదించినట్లు పోలీసులు వెల్లడించారు.
మెథాంఫేటమిన్‌ను తయారు చేయడానికి సూడోపెడ్రిన్‌ను ఉపయోగిస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత డిమాండ్ ఉన్న డ్రగ్. ఇది ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్‌లో రూ. కిలో 1.5 కోట్లు.
Also Read: Zero-Tolerance Policy: ప్రశ్నాపత్రం లీక్ చేస్తే జీరో టాలరెన్స్ విధానం: సీఎం యోగి