Vikram : తమిళ్ స్టార్ హీరో విక్రమ్ ప్రతి సినిమాకు తనని తాను మార్చుకొని చాలా కష్టపడతాడని తెలిసిందే. ఎలాంటి గెటప్ అయినా, ఎలాంటి స్టంట్స్ అయినా చేసే హీరోల్లో విక్రమ్ ఒకరు. ప్రతి సినిమాలో చాలా కొత్తగా మెప్పిస్తారు ప్రేక్షకులని. ఇటీవలే తంగలాన్ సినిమాతో మరోసారి ప్రేక్షకులని మెప్పించాడు విక్రమ్. అయితే విక్రమ్ 1990 నుంచి అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తున్నాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఒక సినిమా ఛాన్స్ మిస్ అయినందుకు రెండు నెలలు ఏడ్చానని చెప్పాడు. విక్రమ్ మాట్లాడుతూ.. నాకు కెరీర్ ఆరంభంలో మణిరత్నం(Maniratnam) గారితో సినిమా చేయాలని ఉండేది. బాంబే సినిమాకు నేను కూడా ఆడిషన్ ఇచ్చాను. కానీ ఆడిషన్ లో చిన్న తప్పు వల్ల నన్ను మణిరత్నం గారు సెలెక్ట్ చేసుకోలేదు. దీంతో ఆ సినిమా ఛాన్స్ పోయిందని దాదాపు రెండు నెలలు ఏడ్చాను అని అన్నారు. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్ రావన్, పొన్నియన్ సెల్వన్ రెండు సినిమాల్లోనూ నటించాడు.
మణిరత్నం దర్శకత్వంలో అరవింద్ స్వామి, మనీషా కొయిరాలా జంటగా వచ్చిన బొంబాయి సినిమా అప్పట్లో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికి ఆ సినిమా పాటలు వింటే ఎంతో హాయిగా అనిపిస్తుంది.
Also Read : Raj Kumar Kasireddy : కమెడియన్‌ని ముద్దులతో ముంచేస్తున్న స్టార్ హీరో..