Site icon HashtagU Telugu

Vijayakanth: ఆస్పత్రిలో చేరిన సినీ నటుడు విజయ్ కాంత్.. ఆందోళనలో అభిమానులు

Vijay Kanth

Vijayakanth

Vijayakanth: తమిళ్ స్టార్ హీరో విజయ్‌కాంత్ కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. విజయ్‌కాంత్‌కు తీవ్ర మధుమేహం ఉంది. దాంతో.. ఆయనకు అనారోగ్య సమస్యలు తరచూ ఎదురవుతున్నాయి. తాజాగా ఆయన గొంతు ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారనీ… దాంతో.. విజయ్‌కాంత్‌ని కుటుంబ సభ్యులు చెన్నై పోరూర్‌లోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించారని సమాచారం. తీవ్రమైన గొంతునొప్పితో పాటు జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో విజయ్ కాంత్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. అనారోగ్యం కారణంగానే విజయ్‌కాంత్ కొద్దిరోజులుగా పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనడం లేదని పలువురు చెబుతున్నారు. ఈ క్రమంలోనే గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం చేయలేదు. విజయ్‌కాంత్‌ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండడంతో ఆయన భార్య ప్రేమలత ముందుండి పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. విజయ్ శాంత్ కు తమిళనాడులో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ఆస్పత్రిలో చేరారనే వార్త తెలియగానే ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.