Tamil Movies : టాలీవుడ్ నుంచి రిలీజ్ కావాల్సిన పలు పాన్ ఇండియా సినిమాలు ఒకటి తరువాత ఒక వాయిదా పడడం తమిళ్ సినిమాలకు బాగా కలిసొస్తుంది. మొన్నటివరకు రిలీజ్ డేట్ దొరక్క ఇబ్బందులు పడ్డ తమిళ్ చిత్రాలు.. ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుగు సినిమా రిలీజ్ డేట్స్ ని ఆక్రమించేస్తున్నాయి. టాలీవుడ్ లో రిలీజ్ కావాల్సిన పుష్ప 2, ఓజి సినిమాలు పోస్టుపోన్ అయ్యాయి. ఇక గేమ్ ఛేంజర్ ఏమో దివాళీ లేదా క్రిస్టమస్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక అక్టోబర్ లో రావాల్సిన దేవర ఏమో సెప్టెంబర్ కి వెళ్ళింది.
దీంతో అక్టోబర్ అంతా ఖాళీగా ఉంది. ఇక ఈ గ్యాప్ ని గమనించిన తమిళ్ చిత్రాలు.. కర్చీఫ్‌లు వేసి డేట్స్ ని లాక్ చేసుకుంటున్నారు. అక్టోబర్ 10 నుంచి దేవర సినిమా తప్పుకోవడంతో.. వెంటనే ఆ డేట్ సూర్య ఆక్రమించేసారు. సూర్య నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘కంగువ’ని అక్టోబర్ 10న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు. ఇక తాజాగా శివ కార్తికేయన్ కూడా తన కొత్త సినిమా ‘అమరన్’ని అక్టోబర్ లోనే తీసుకు రాబోతున్నట్లు అనౌన్స్ చేసారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని దివాళీ కానుకగా అక్టోబర్ 31న రేలి చేయబోతున్నట్లు అనౌన్స్ చేసారు.
అలా గేమ్ ఛేంజర్ ప్లేస్ ని శివ కార్తికేయన్ తీసుకున్నారు. వీరిద్దరితో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా అక్టోబర్ లోనే రాబోతున్నట్లు అనౌన్స్ చేసారు. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వెట్టియాన్’ సినిమాని కూడా అక్టోబర్ లోనే రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు. అలాగే అజిత్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘విడాముయార్చి’ని కూడా అక్టోబర్ లోనే రిలీజ్ చేసేందుకు సిద్ధం చేస్తున్నారట. ఇలా తమిళ్ సినిమాలు అన్ని అక్టోబర్ ని పూర్తిగా ఆక్రమించుకున్నాయి.