Tamil Film Industry : తమిళ పరిశ్రమలో ప్రస్తుతం నిర్మాతలు, నటీనటుల మధ్య యుద్ధం నడుస్తుంది. తమిళ నిర్మాతల మండలి నిన్న తీసుకున్న నిర్ణయాల పట్ల నటీనటుల సంఘం కోపంగా ఉంది. ఇటీవల సినీ పరిశ్రమ నష్టాలని చూస్తుందని, ముఖ్యంగా నిర్మాతలు నష్టపోతున్నారని, థియేటర్స్ సమస్యలు ఉన్నాయని తాజాగా తమిళ నిర్మాతల మండలి నిన్న మీటింగ్ పెట్టింది.
తమిళ నిర్మాతల మండలి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకొని వాటిని ప్రకటించింది. ఇకపై ఏ హీరో, హీరోయిన్ కూడా ఒకేసారి ఒక సినిమా కంటే ఎక్కువ అడ్వాన్స్ లు తీసుకోకూడదు అని, ఒక సినిమా పూర్తయ్యాకే ఇంకో సినిమాకు డేట్స్ ఇవ్వాలని, పెండింగ్ ఉన్న సినిమాలన్నీ ముందు పూర్తి చేయాలని నిర్ణయించారు. అలాగే హీరో ధనుష్ అడ్వాన్స్ లు తీసుకొని సినిమాలు చేయట్లేదని, ఇకపై ధనుష్ తో ఎవరైనా సినిమా చేయాలంటే నిర్మాతల మండలి నుంచి క్లియరెన్స్ తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే స్టార్ హీరోల సినిమాలు ఓటీటీలో సినిమా రిలీజ్ అయ్యాక రెండు నెలల తర్వాతే రిలీజ్ చేయాలని, ఇప్పుడు పెండింగ్ లో ఉన్న సినిమాలన్నీ అక్టోబర్ 31 కల్లా పూర్తి చేయాలని, ఆగస్టు 1 నుంచి ఎలాంటి కొత్త సినిమాలు మొదలుపెట్టకూడదని, నవంబర్ 1 నుంచి కొన్నాళ్ళు సినిమా షూటింగ్స్ బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేసారు తమిళ నిర్మాతల మండలి.
అయితే తమిళ నిర్మాతల మండలి తీసుకున్న కఠిన నిర్ణయాలపై తమిళ నటీనటుల సంఘం వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా ధనుష్ ని టార్గెట్ చేయడంపై మండిపడుతుంది. నటీనటుల సంఘంతో మాట్లాడకుండా ఆంక్షలు విధించడం కరెక్ట్ కాదని అన్నారు. అలాగే సినిమా షూటింగ్స్ ఆపేయమనడం కూడా కరెక్ట్ కాదని, నిర్మాతల నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని ఓ లేఖ విడుదల చేసారు. దీంతో తమిళ సినీ పరిశ్రమలో నిర్మాతలు వర్సెస్ నటీనటులుగా మారడంతో సినిమాలు షూటింగ్ జరుగుతాయా? షూటింగ్స్ ఆగుతాయా? కొత్త సినిమాల పరిస్థితి ఏంటి అని అంతా చర్చించుకుంటున్నారు.
Also Read : RajaSaab Glimpse : ప్రభాస్ రాజాసాబ్ గ్లింప్స్.. పూలతో తనకు తానే దిష్టి తీసుకున్న రెబల్ స్టార్