Site icon HashtagU Telugu

Tamannah Ready for Marriage : పెళ్లికి రెడీ అవుతున్న తమన్నా.. ఆ టెంపుల్ లో ప్రత్యేక పూజలు అందుకోసమేనా..?

Tamanna Ready For Marriage Special Pooja In Gauhathi Kamakhya Temple Here Is The Photos

Tamanna Ready For Marriage Special Pooja In Gauhathi Kamakhya Temple Here Is The Photos

Tamanna Ready for Marriage మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లికి రెడీ అవుతుందా.. అందుకే గౌహతి లోని కామాఖ్యా టెంపుల్ లో ప్రత్యేక పూజలు చేసిందా అంటే అవుననే అంటున్నాయి మీడియా వర్గాలు. కొన్నాళ్లుగా మీడియాలో తమన్నా పెళ్లి మ్యాటర్ స్పెషల్ న్యూస్ గా మారింది.

We’re now on WhatsApp : Click to Join

బాలీవుడ్ నటుడు వినయ్ వర్మతో తమన్నా ప్రేమాయణం మొదట్లో సీక్రెట్ గా జరిగినా ఆ తర్వాత ఇద్దరు ఓపెన్ అయ్యారు. ముంబైలో ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకుని కనిపించారు. వీరి ప్రేమని వారే పబ్లిక్ గా అంగీకరించారు.

ప్రేమ ఓకే కానీ పెళ్లి విషయంలో మాత్రం నోరు విప్పలేదు. కొన్నాళ్లు ఇలానే కెరీర్ కొనసాగించాలని అనుకున్నారు. అయితే పెళ్లి మ్యాటర్ పై సైలెంట్ గా ఉన్న తమన్నా లేటెస్ట్ గా గౌహతిలోని కామాఖ్యా టెంపుల్ లో ప్రత్యేక పూజలు చేసింది. ఫ్యామిలీతో కలిసి తమన్నా ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నది. అయితే తమన్నా పెళ్లి కోసమే ఈ పూజలని అందరు అనుకుంటున్నారు.

ఎప్పుడు గ్లామర్ క్వీన్ గా కనిపించే తమన్నా పూర్తిగా ట్రడిషనల్ లుక్ తో సర్ ప్రైజ్ చేసింది. మెడలో పూల మాల, నుదుటి మీద కుంకుమ ఇలా తమన్నా లుక్ చూస్తే డివోషనల్ వైబ్స్ అనిపిస్తున్నాయి. టెంపుల్ లో తమన్నా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూస్తే తమన్నా నిజంగానే పెళ్లికి సిద్ధమైనట్టు ఉంది.

Also Read : Pawan Kalyan-Trivikram : పవన్ కళ్యాణ్.. త్రివిక్రం.. గ్యాప్ వచ్చిందా.. ఇచ్చారా..?

మరి అసలు విషయం ఏంటన్నది అమ్మడు చెప్పాల్సిందే. తెలుగుతో పాటుగా తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తున్న తమన్నా ఇప్పటికీ సూపర్ ఫాం కొనసాగిస్తుంది. ఈమధ్యనే వెబ్ సీరీస్ లతో తనలోని కొత్త యాంగిల్ చూపించిన అమ్మడు తన ఫ్యాన్ బేస్ ని మరింత పెంచుకుంటుంది.