Odela 2 Teaser : 2022 లో హెబ్బా పటేల్ మెయిన్ లీడ్ లో వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్ సినిమా మంచి విజయం సాధించింది. డైరెక్టర్ సంపత్ నంది అందించిన కథతో అశోక్ తేజ దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కింది. అయితే అది డైరెక్ట్ ఓటీటీలో రిలీజయింది. సినిమా మంచి రిజల్ట్ రావడంతో ఓదెల 2 కూడా అనౌన్స్ చేసారు. తమన్నా మెయిన్ లీడ్ తో ఓదెల 2 ప్రకటించారు.
ప్రస్తుతం ఓదెల 2 సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాలో తమన్నా లేడీ అఘోరా పాత్రలో కనిపించబోతుంది. ఇప్పటికే తమన్నా ఫస్ట్ లుక్ రాగా సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని మధు క్రియేషన్స్ బ్యానర్ పై సంపత్ నంది కథకు అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. తాజాగా నేడు మహా కుంభమేళాలో ఓదెల 2 టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి టీజర్ రిలీజ్ చేసారు.
మీరు కూడా తమన్నా ఓదెల 2 టీజర్ చూసేయండి..
ఇక ఈ టీజర్ చూస్తుంటే ఓదెల పార్ట్ 1 కి కంటిన్యూ ఉండబోతుంది ఈ సినిమా అని తెలుస్తుంది. ఓదెల ఊర్లో జరిగే సంఘటనలు, ఓ దుష్టశక్తి – దేవుడికి మధ్య జరిగే సంఘర్షణగా ఉండబోతుంది అని తెలుస్తుంది. సినిమాలో తమన్నా లేడీ అఘోరా పాత్రలో అదరగొట్టబోతుందని తెలుస్తుంది.
Also Read : Unni Mukundan : సినిమాలో రొమాన్స్ చేయమని ఇబ్బంది పెట్టారు.. హీరో కామెంట్స్..