Tamannaah and Chiru: చిరు కోసం స్విట్జర్లాండ్ కు వెళ్లిన తమన్నా, ఎందుకో తెలుసా!

వాల్తేరు వీరయ్య లో హీరోయిన్ శ్రుతి హాసన్ తో కలిసి డ్యూయట్ పాడుకున్న చిరు, లేటెస్ట్ మూవీలో అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Chiru Ana Tammanna

Chiru Ana Tammanna

మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరోయిన్స్ రొమాన్స్ చేస్తూనే, కుర్ర హీరోయిన్స్ తోనూ ఆడిపాడేందుకు సిద్ధమవుతున్నాడు. చిరు తన సినిమాల్లో కచ్చితంగా ఐటెం సాంగ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. అంతేకాదు.. మంచి డ్యూయట్స్ ఉండేలా దర్శకులపై ఒత్తిడి తెస్తున్నాడు. ఇటీవల విడుదలైన వాల్తేరు వీరయ్య పాటలు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో చిరంజీవి పాటలపై మరింత ఫోకస్ చేస్తున్నాడు. హుషారెత్తించే బీట్స్, మనసు దొచుకునే లిరిక్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

వాల్తేరు వీరయ్య లో హీరోయిన్ శ్రుతి హాసన్ తో కలిసి డ్యూయట్ పాడుకున్న చిరు, లేటెస్ట్ మూవీలో అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి మిల్కీ బ్యూటీ తమన్నాతో కలిసి స్టెప్పులు వేయబోతున్నాడు. చిరంజీవి హీరోగా వస్తోన్న ‘భోళా శంకర్’ సినిమాలో పాట స్విట్జర్లాండ్ లో జరుగుతోంది. అయితే ఇందులో మంచి డ్యూయట్ సాంగ్ ఒకటి ఉంది.

ఇందుకోసం మిల్కీ బ్యూటీ తమన్నా చిరుతో రొమాన్స్ చేసేందుకు ముంబై నుంచి స్విట్జర్లాండ్ బయలుదేరి వెళ్లింది. మంచి చార్ట్ బస్టర్ గా నిలిచేలా ఈ పాటను షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. మంగళవారం ముంబై ఎయిర్‌పోర్టులో తమన్నా కనిపించారు. ఈ మూవీలో ప్రధాన హీరోయిన్ గా మిల్క్ బ్యూటీ నటిస్తోంది. భోళా శంకర్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలో విడుదలకు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.

Also Read: Prabhas Golden Heart: దటీజ్ ప్రభాస్.. రాధేశ్యామ్ కోసం 50 కోట్లు వెనక్కి ఇచ్చేసిన డార్లింగ్!

  Last Updated: 16 May 2023, 03:20 PM IST