Sanjay Dutt: బాలీవుడ్ మున్నాభాయ్ కు భలే డిమాండ్, 60 రోజులకే 15 కోట్లు రెమ్యునరేషన్

సౌత్ స్క్రీన్‌పై బాలీవుడ్ విలన్లు అదరగొడుతున్నారు. ఆదిపురుష్ మూవీలో సైఫ్ విలన్ నటించిన విషయం తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
Sanjay

Sanjay

సౌత్ స్క్రీన్‌పై బాలీవుడ్ విలన్లు అదరగొడుతున్నారు. ఆదిపురుష్ మూవీలో సైఫ్ విలన్ నటించిన విషయం తెలిసిందే. అయితే మున్నాభాయ్‌గా గుర్తింపు తెచ్చుకున్న సంజయ్‌దత్‌కి తెలుగులో మంచి ఆఫర్లు వస్తున్నాయి. రీసెంట్‌గా ‘డబుల్‌ స్మార్ట్‌’లో విలన్‌ రోల్‌ అందుకున్నాడు. రామ్‌-పూరి కాంబినేషన్‌లో సినిమా రూపొందుతోంది. సంజు ‘బిగ్ బుల్’ పాత్రను ఇటీవలే చిత్ర బృందం పరిచయం చేసింది. సంజు ఈ సినిమా కోసం దాదాపు 60 రోజుల కాల్షీట్లను ఇచ్చాడు. అందుకు గాను చిత్ర బృందం రూ.15 కోట్ల రెమ్యునరేషన్ చెల్లించిందట.

ఈ విషయాన్ని నిర్మాతలే స్వయంగా ప్రకటించారు. ఇటీవల ముంబైలో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. దీనికి సంజు పరిచయం కూడా ఉంది. దాంతో ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. మరో దశ చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది. ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఇద్దరు హీరోయిన్లున్నారు. నిర్మాతలుగా పూరి జగన్నాథ్, ఛార్మి వ్యవహరిస్తుననారు. సంజయ్ దత్తు ఈ సినిమాలే కాకుండా విజయ్ దళపతి, ప్రభాస్ సినిమాలోనూ కీలక పాత్రల్లో నటిస్తున్నాడు.

లియో చిత్రంలో ఈ బాలీవుడ్ సీనియర్ స్టార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల సంజయ్ దత్ పుట్టిన రోజు సందర్భంగా లియోలో ఆయన పాత్రను లోకేశ్ పరిచయం చేశారు. లియోలో ఆంటోనీ దాస్ క్యారెక్టర్ చేస్తున్నారు సంజయ్. ఆయన లుక్ కు, నటనకు బిగ్ రెస్పాన్స్ వచ్చింది. కేజీఎఫ్ సినిమాతో అందర్నీ ఆకట్టుకున్న సంజయ్ పలు సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటున్నాడు.

Also Read: Bikini Actress: బికినీతో బోల్డ్ షో.. భారీ ఫాలోయింగ్ తో కోట్లు కొల్లగొడుతున్న బ్యూటీలు!

  Last Updated: 03 Aug 2023, 12:05 PM IST