Site icon HashtagU Telugu

Vijay Devarakonda : బాలకృష్ణ కాదు రౌడీ హీరోని లైన్ లో పెడుతున్న డైరెక్టర్..!

Vijay Devarakonda Missed Four Super Hit Movies

Vijay Devarakonda Missed Four Super Hit Movies

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో టాక్సీవాలా సినిమా చేసి హిట్ అందుకున్న డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ తన సెకండ్ సినిమాగా నానితో శ్యాం సింగ్ రాయ్ సినిమా చేశాడు. రెండు సినిమాలు చేసి రెండిటితో సక్సెస్ అందుకున్న రాహుల్ సంకృత్యన్ తన నెక్స్ట్ సినిమా నందమూరి బాలకృష్ణ తో చేస్తాడని వార్తలు వచ్చాయి. బాలయ్యతో ఒక పీరియాడికల్ కథను రెడీ చేసిన రాహుల్ ఆయన ఓకే అంటే సినిమా చేయాలని అనుకున్నారు. కానీ ఆ కాంబో మూవెపై ఎలాంటి అప్డేట్ రాలేదు.

బాలకృష్ణ సినిమా ఏమో కానీ రాహుల్ సంకృత్యన్ తన తర్వాత సినిమా విజయ్ దేవరకొండతో సినిమా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. బాలయ్య సినిమా ఏమైందో కానీ రౌడీ హీరో తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడట రాహుల్. ఆల్రెడీ విజయ్ దేవరకొండతోనే రాహుల్ సంకృత్యన్ టాక్సీవాలా సినిమా తీసి హిట్ అందుకున్నాడు.

మళ్లీ ఈ సూపర్ హిట్ కాంబో రిపీట్ కాబోతుందని తెలుస్తుంది. శ్యాం సింగ రాయ్ తర్వత రాహుల్ ఒకటి రెండు భారీ ప్రాజెక్టులు ప్లాన్ చేయగా వాటిపై క్లారిటీ రాలేదు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతం తిన్ననూరితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ రాహుల్ తోనే సినిమా చేస్తాడా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.

రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశపరచిన విజయ్ దేవరకొండ కెరీర్ లో ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.