Site icon HashtagU Telugu

Balakrishna : బాలకృష్ణతో టాలెంటెడ్ డైరెక్టర్..?

Balakrishna Gopichand Malineni Combination Movie Again

Balakrishna Gopichand Malineni Combination Movie Again

Balakrishna స్టార్ హీరోలతో పోటీగా సీనియర్ స్టార్స్ ప్రయోగాలకు సిద్ధం అంటున్నారు. నందమూరి బాలకృష్ణ 100 సినిమాల తర్వాత తన వేగాన్ని పెంచారు. లాస్ట్ ఇయర్ భగవంత్ కేసరి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బాలయ్య బాబు తన 108వ సినిమాను కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో చేస్తున్నారు. ఇదే కాదు కొత్త ప్రయోగాలకు కూడా రెడీ అనేస్తున్నారు బాలకృష్ణ.

లేటెస్ట్ గా నందమూరి బాలకృష్ణతో యువ హీరో రాహుల్ సంకృత్యన్ సినిమాకు రెడీ అంటున్నాడట. నానితో శ్యాం సింగ రాయ్ సినిమా చేసిన రాహుల్ ఆ సినిమా తర్వాత సరైన కథ కోసం ఇన్నాళ్లు ఎదురుచూశారు. తను రాసుకున్న ఒక పీరియాడికల్ స్టోరీ కి బాలకృష్ణ పర్ఫెక్ట్ అని అనుకుంటున్నారట. అందుకే బాలకృష్ణతో కథా చర్చలకు రెడీ అవుతున్నారట.

రాహుల్ సంకృత్యన్ ఒక అద్భుతమైన పీరియాడికల్ స్టోరీ సిద్ధం చేశాడట. ఈ కథకు బాలయ్య అయితే బాగుంటాడని ఆయనతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. రాహుల్ కథ ఓకే అయితే బాలకృష్ణతో అతను చేసే సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని చెప్పొచ్చు. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరైన రాహుల్ తన నెక్స్ట్ సినిమాతో భారీ ప్లానింగ్ తో ఉన్నాడని తెలుస్తుంది. మరి ఈ కాంబో సెట్ అవుతుందా లేదా అన్నది త్వరలో డీటైల్స్ తెలుస్తాయి.

Also Read : Pooja Hegde : అలా చేస్తానంటున్న కూడా పూజ హెగ్డేకు ఆఫర్లు రావట్లేదా..?