Tabu : పాతికేళ్ల తర్వాత ఆ స్టార్ హీరోతో టబు.. క్రేజీ ప్రాజెక్ట్ తో ఎంట్రీ..!

సౌత్ నార్ అనే తేడా లేకుండా నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ ని ఉర్రూతలూగించిన హీరోయిన్ టబు (Tabu). తెలుగు అమ్మాయే అయినా ఇక్కడ స్టార్ క్రేజ్ దక్కించుకున్నాక బాలీవుడ్ వెళ్లి

Published By: HashtagU Telugu Desk
50 plus heroine Tabu ready to do Romantic movies

50 plus heroine Tabu ready to do Romantic movies

సౌత్ నార్ అనే తేడా లేకుండా నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ ని ఉర్రూతలూగించిన హీరోయిన్ టబు (Tabu). తెలుగు అమ్మాయే అయినా ఇక్కడ స్టార్ క్రేజ్ దక్కించుకున్నాక బాలీవుడ్ వెళ్లి అక్కడ సత్తా చాటింది. అయితే కొన్నాళ్లుగా హిందీ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన టబు తెలుగు, తమిళ భాషల్లో కూడా చేయాలని అనుకుంటుంది. 3 ఏళ్ల క్రితం అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో (Ala Vaikunthapuramulo) సినిమాలో నటించిన టబు ఆ సినిమాతో ప్రేక్షకులను అలరించింది.

We’re now on WhatsApp : Click to Join

ఇప్పుడు తమిళ సినిమాలో నటించబోతుంది టబు. కోలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఏకంగా 24 ఏళ్ల తర్వాత టబు జత కడుతుంది. కోలీవుడ్ స్టార్ హీరో తల అజిత్ తో టబు కలిసి నటించబోతుంది. అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో తెరకెక్కే ఈ సినిమాలో అజిత్ సరసన టబు నటిస్తుందని తెలుస్తుంది. అజిత్, టబు కలిసి 2000 లో వచ్చిన కండు కొండేన్ సినిమాలో నటించారు.

రాజీవ్ మీనన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా తెలుగులో ప్రియురాలు పిలిచింది పేరుతో రిలీజైంది. మళ్లీ 24 ఏళ్ల తర్వాత అజిత్, టబు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. 2013 లో చివరి తమిళ సినిమా చేసిన టబు మళ్లీ ఇన్నాళ్లకు అక్కడ నటిస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో ఉన్న టబు ఫ్యాన్స్ ఆమె ఇక్కడ మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు.

Also Read : Suhas Ambajipeta Marriage Band Trailer : అంబాజీ పేట మ్యారేజి బ్యాండు ట్రైలర్.. కుర్ర హీరో గురి చూసి కొడతుతున్నాడుగా..!

  Last Updated: 24 Jan 2024, 02:35 PM IST