Tabu – Nagarjuna : నాగార్జున ఫోటోకి టబు హార్ట్ సింబల్స్.. మళ్ళీ తెరపైకి ప్రేమ వార్తలు..

నాగచైతన్య షేర్ చేసిన నాగార్జున ఫోటోకి సీనియర్ యాక్ట్రెస్ టబు హార్ట్ సింబల్స్. దీంతో తెరపైకి మళ్ళీ నాగ్-టబు ప్రేమ వార్తలు వచ్చాయి.

  • Written By:
  • Publish Date - June 17, 2024 / 01:04 PM IST

Tabu – Nagarjuna : బాలీవుడ్ యాక్ట్రెస్ టబు తెలుగులో చేసింది కొన్ని సినిమాలే. అయితే వాటిలో మూడు సినిమాల్లో నాగార్జునతోనే కనిపించారు. రెండు సినిమాల్లో నాగార్జున పక్కన హీరోయిన్ ఆ నటించిన టబు.. ఓ సినిమాలో మాత్రం స్పెషల్ సాంగ్ లో నాగ్ తో కలిసి చిందేశారు. ఈ సినిమాలు గురించి పక్కన పెడితే.. అప్పటిలో వీరిద్దరి గురించిన ప్రేమ వార్తలో హాట్ టాపిక్ గా ఉండేవి. దాదాపు దశాబ్దం పాటు వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని ఒకప్పుడు పుకార్లు వచ్చాయి.

అయితే ఈ రేలషన్‌షిప్ గురించి టబు మరియు నాగ్ మౌనం పాటిస్తూనే వచ్చారు. కానీ ఓ సందర్భంలో మాత్రం నాగార్జున, టబు గురించి మాట్లాడుతూ.. టబు నాకు అద్భుతమైన స్నేహితురాలు. మా స్నేహం గురించి, ఏది చెప్పినా తక్కువే. ఆమె గురించి నేను దాచడానికి ఏమీ లేదు. మీరు ఆమె పేరు చెప్పగానే, నా ముఖం వెలిగిపోతుంది. అది మీ దృష్టిలో వేరే బంధంలా కనిపిస్తుంది. కానీ నాకు మాత్రం ఆమె ఒక మంచి వ్యక్తి మరియు మంచి స్నేహితురాలు” అంటూ చెప్పుకొచ్చారు.

టబు మాత్రం ఈ బంధం పై మౌనం పాటిస్తూనే వచ్చారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఆమె ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోయారు. ఇందుకు కారణం కూడా నాగార్జున పై ప్రేమే అంటారు కొంతమంది. ఇది ఇలా ఉంటే, రీసెంట్ గా టబు చేసిన ఓ కామెంట్.. మళ్ళీ వీరి ప్రేమ వార్తలు చర్చకి వచ్చేలా చేసింది. ఫాదర్స్ డే సందర్భంగా నాగచైతన్య.. నాగార్జునతో ఉన్న చైల్డ్‌హుడ్ ఫోటోని షేర్ చేసారు.

ఇక ఈ ఫోటో పై టబు రియాక్ట్ అవుతూ.. లవ్ సింబల్స్ ని కామెంట్ చేసారు. ఇక ఇది గమనించిన నెటిజెన్స్.. నాగార్జున, టబు ప్రేమ గురించి మళ్ళీ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. మరి వీరిద్దరి ప్రేమాయణం నిజమేనా..? లేదా..? అనేది టబు, నాగ్‌లకే తెలియాలి.

Tabu Comment On Heart Symbols To Nagarjuna Photo Shared By Naga Chaitanya (1)