Site icon HashtagU Telugu

‘Dobaaraa’ shows cancelled: బాలీవుడ్ కు మరో షాక్.. తాప్సీ మూవీ అట్టర్ ప్లాప్!

Dobaaraa Imresizer

Dobaaraa Imresizer

బాలీవుడ్ వరుస ఫ్లాపులతో సతమతమవుతోంది. హిందీ పరిశ్రమకు ఊపిరి పోయాలని భావించిన బడా దర్శకులు, స్టార్ హీరోల వరుసగా షాక్స్ తగులుతున్నాయి. పృథ్వీరాజ్ చౌహాన్, షంషేరా, లాల్ సింగ్ చద్దా లాంటి ఎన్నో పెద్ద సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఈ జాబితాలో తాప్సీ కొత్త చిత్రం దొబారా చేరింది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం (ఆగస్టు 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, థియేటర్లు మాత్రం రెండు మూడు శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి.

జనం రాకపోవడంతో చాలా షోలు రద్దు చేస్తున్నారు. తొలిరోజు 30 లక్షలు, ఫుల్ రన్‌లో 1.5 కోట్లు రాబట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిజానికి సినిమా ప్రమోషన్లను బహిష్కరిస్తున్న తీరుపై తాప్సీ, అనురాగ్ స్పందించారు. 2018లో విడుదలైన స్పానిష్‌ చిత్రం ‘మిరాజ్‌’కి ‘దొబారా’ రీమేక్‌.