Site icon HashtagU Telugu

Tollywood: పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. వరుడు ఎవరో తెలుసా?

Mixcollage 28 Feb 2024 01 19 Pm 9583

Mixcollage 28 Feb 2024 01 19 Pm 9583

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.. అందులో భాగంగానే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీ తో కలిసి మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. అలాగే టాలీవుడ్ హీరోయిన్ అక్షా పార్ధసాని సైతం తన ప్రియుడితో ఏడడుగులు వేసింది. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. దాదాపు పదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బ్యాచిలర్ లైఫ్‏కు గుడ్ బై చెప్పనుందట.

ఇప్పుడు ఇదే విషయం బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా ?తనే టాలీవుడ్ అందాల రాశి తాప్సీ. ఇటీవలే షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తాప్సీ తన పర్సనల్ విషయాలను మాత్రం అంతగా షేర్ చేసుకోదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ షిఫ్ట్ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే తాప్సీ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బాస్‎తో దాదాపు పదేళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే తమ రిలేషన్ షిప్ పై ఇంట్రెస్టింగ్ పోస్ట్ కూడా చేసింది.

కానీ వీరిద్దరు కలిసి కనిపించింది చాలా అరుదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం తాప్సీ త్వరలోనే తన ప్రియుడు మథియాస్ తో ఏడడుగులు వేయనుందట. మీడియా నివేదికల ప్రకారం ఆమె పెళ్లి వచ్చే నెల మార్చిలో ఉదయపూర్ లో అట్టహాసంగా జరగనుందని టాక్. వీరి పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు, బాలీవుడ్ సినీ ప్రముఖులు, సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి వివాహం సిక్కు, క్రైస్తవ సంప్రదాయల ప్రకారం జరగనుందని తెలుస్తోంది. తాప్సీకి కాబోయే భర్త మథియాస్ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్. అతడు రెండుసార్లు యూరోపియన్ ఛాంపియన్.. ఒలింపిక్ పతక విజేత కూడా. అయితే ఈ వార్తలను తాప్సీ ఇంకా ధృవీకరించలేదు.

Exit mobile version