Taapsee Pannu : మరోసారి సౌత్ సినిమాలపై తాప్సీసంచలన వ్యాఖ్యలు..

తాప్సీ బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత సౌత్ సినిమాలను, ముఖ్యంగా తెలుగు సినిమాలను అస్సలు పట్టించుకోవడం మానేసింది. గతంలో ఓ సారి సౌత్ సినిమాలపై తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

Published By: HashtagU Telugu Desk
Taapsee Pannu sensational comments on south movies

Taapsee Pannu sensational comments on south movies

తెలుగు సినిమా ‘ఝమ్మంది నాదం’తోనే సినీ పరిశ్రమకు పరిచయమైంది తాప్సీ(Taapsee Pannu). అనంతరం తెలుగు(Telugu), తమిళ్(Tamil) లో వరుసగా సినిమాలు చేసింది. తెలుగులో సినిమాలు చేస్తున్న సమయంలోనే బాలీవుడ్(Bollywood) లో ఆఫర్స్ రావడంతో అక్కడికి చెక్కేసింది. ప్రస్తుతం హిందీలో వరుసగా సినిమాలు చేస్తుంది తాప్సీ. హిందీతో పాటు కొన్నితమిళ సినిమాలు కూడా తాప్సీ చేతిలో ఉన్నాయి.

తాప్సీ బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత సౌత్ సినిమాలను, ముఖ్యంగా తెలుగు సినిమాలను అస్సలు పట్టించుకోవడం మానేసింది. గతంలో ఓ సారి సౌత్ సినిమాలపై తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో.. సౌత్ సినిమాలు చేసి ఎదిగి అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ సౌత్ సినిమాలనే కామెంట్స్ చేస్తావా అని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. అయినా తాజాగా తాప్సీ మరోసారి సౌత్ సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

తాజాగా తాప్సీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నటిగా మీకు సౌత్ లో గుర్తింపు వచ్చిందా లేక నార్త్ లోనా అని అడగగా తాప్సీ సమాధానమిస్తూ.. సౌత్ లో నేను చాలా సినిమాలు చేశాను. స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేసినప్పటికీ నాకు సౌత్ లో నటిగా గుర్తింపు తెచ్చే పాత్రలు రాలేదు. నటిగా సంతృప్తిని ఇచ్చే పాత్రలు నాకు సౌత్ లో రాలేదు. బాలీవుడ్ లో పింక్ సినిమాతో నటిగా నాకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాతే నా జీవితం మలుపు తిరిగింది అని తెలిపింది. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ కాగా మరోసారి సౌత్ నెటిజన్లు తాప్సీని తీవ్రంగా విమర్శిస్తున్నారు.

 

Also Read :    Samantha Ruth Prabhu : బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోతున్న సమంత

  Last Updated: 19 Apr 2023, 05:43 PM IST