Taapsee Marriage : సినీ నటి తాప్సీ రహస్యంగా డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోను పెళ్లి చేసుకుంది. ఈనెల 23న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో తాప్సీ- మథియాస్ బో పెళ్లి జరిగిందని తెలిసింది. మార్చి 20 నుంచే ప్రీవెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయని సమాచారం. అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరైనట్లు సమాచారం. ఈ వేడుకకు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ వెళ్లినట్లు తెలుస్తోంది. తాప్సీ బెస్ట్ ఫ్రెండ్, ప్రొడ్యూసర్ కనిక తాజాగా కొన్ని ఫొటోలు షేర్ చేశారు. ఆ ఫొటోలకు ‘నా స్నేహితుల పెళ్లిలో’ అని క్యాప్షన్ పెట్టారు. దీంతో ఆమె ఈ పెళ్లికే(Taapsee Marriage) వెళ్లి ఉంటారని అంచనా వేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
దక్షిణాది నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సమయంలోనే తాప్సీకు మథియాస్‌తో పరిచయం ఏర్పడింది.ఆ పరిచయం ప్రేమగా మారింది. మథియాస్ బోతో తాప్సీ దాదాపు పదేళ్లుగా ప్రేమ కమ్ రిలేషన్‌లో ఉంది. వీరి పెళ్లి పుకార్లపై ఇటీవల తాప్సీ స్పందిస్తూ.. ‘‘వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో చెప్పమంటూ ఎవరినీ ఒత్తిడి చేయకూడదు. ఒకవేళ నేను దేని గురించైనా ప్రకటన చేయాలనుకుంటే స్వయంగా వెల్లడిస్తాను. పెళ్లి అనేది అందరి జీవితాల్లో ముఖ్యమైన భాగం. దాని గురించి నేనేం దాచాలనుకోవడం లేదు. సరైన సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది’’ అని చెప్పారు.
Also Read :Ghost Jobs : ‘ఘోస్ట్ జాబ్స్’కు అప్లై చేశారో.. జరిగేది అదే !!
తాప్సీ కెరీర్ విషయానికి వస్తే.. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. కానీ తను అనుకున్నంత గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్‌ను వదిలేసి బాలీవుడ్‌కు షిఫ్ట్ అయిపోయింది. అక్కడ ఓ పక్క స్టార్ హీరోలతో నటిస్తూనే హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ యాక్ట్ చేస్తోంది.