Site icon HashtagU Telugu

Sweet Palakova Promo : శేఖర్ మాస్టర్ మ్యూజిక్ నుండి వచ్చిన ‘స్వీట్ పాలకోవా’ ప్రోమో

Sweet Palakova

Sweet Palakova

శేఖర్ మాస్టర్ (Sekhar Master)..వెండితెరపై మాస్‌.. క్లాస్‌.. మాంటేజ్‌.. ఇలా డ్యాన్స్‌ థీమ్‌ ఏదైనా తనదైన స్టైల్​లో కొత్త స్టెప్పులతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంటాడు. డ్యాన్స్‌.. డ్యాన్స్‌.. డ్యాన్స్‌.. ఇదే ఆశగా.. శ్వాసగా సాగిపోతుంటారాయన. తాను చేసే ప్రతి పాటలోనూ ఏదో కొత్తదనం ఉండాలని పరితపిస్తుంటారు. ‘జబర్దస్త్‌’కు వెళ్తే, కంటెస్టెంట్‌లతో కలిసిపోయి ‘శేకు’గా నవ్వులు పంచుతారు. అటు అగ్ర హీరోలతో ఇటు యువ హీరోలతోనూ తనదైన శైలిలో స్టెప్‌లు వేయించి వెండితెరను ‘షేక్‌’ చేసేస్తుంటారు. అలాంటి శేఖర్ మాస్టర్ తాజాగా మ్యూజిక్ ఛానల్ ను ప్రారంభించారు.

We’re now on WhatsApp. Click to Join.

శేఖర్ మాస్టర్ (Sekhar Master) అంటే తెలియని డాన్స్ ప్రియులు లేరు..ఢీ షో తో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న శేఖర్..ఆ తర్వాత అగ్ర హీరోలతో పాటు చిన్న హీరోలతో కూడా అదిరిపోయే స్టెప్స్ వేస్తూ..ప్రస్తుతం టాప్ కొరియోగ్రాఫర్ గా చిత్రసీమలో రాణిస్తున్నాడు. కోరియోగ్రాఫర్ గానే కాకుండా పలు టీవీ షోల్లో జేడ్జ్ గాను వ్యవహరిస్తూ బుల్లితెర ఆడియన్స్ ను సైతం అలరిస్తున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని.. టాలీవుడ్ టూ బాలీవుడ్ సత్తా చూపించాడు శేఖర్ మాస్టర్. ఇప్పటి వరకు ఈయన డాన్స్ చూసాం.. ఇప్పుడు ఈయనలో నుండి మరో కోణాన్ని చూడబోతున్నాము.

తాజాగా ఈయన యూట్యూబ్ లో శేఖర్ మ్యూజిక్ ఛానల్ (Sekhar Music Channel) ను ప్రారంభించారు. నేడు గురువారం ఈ ఛానల్ ను ప్రారంభించడం జరిగింది. ఇందులో ముందుగా స్వీట్ పాలకోవా (Sweet Palakova) అంటూ సాగే ప్రోమో ను రిలీజ్ చేసారు. ఈ ఫుల్ సాంగ్ ను అతి త్వరలో విడుదల చేయబోతున్నారు. ఈ సాంగ్ కు కన్హా మొహంతి డైరెక్ట్ చేయగా..ఈ సాంగ్ లో కన్హా మొహంతి, గరిమ కిష్ణని, నిక్కీ జార్జ్ నటించారు. ఈ సాంగ్ కు లైన్ ప్రొడ్యూసర్ గా రవి పొట్లూరి వ్యవహరించారు. ప్రోమో మాత్రం అదిరిపోయింది. చక్కనైన మ్యూజిక్ తో నిక్కీ అదరగొట్టాడు. అలాగే బ్యాక్ గ్రౌండ్ లొకేషన్స్ కూడా చాల బాగున్నాయి. ఇక సాంగ్ ఇంకా ఏ రేంజ్ లో ఉండబోతుందో అని అంత ఎదురుచూస్తున్నారు.

Read Also : Prabhas Salaar : ప్రభాస్ డైనోసార్ ఏం చేస్తాడో..?