Swathi Deekshith: నటి స్వాతిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు

జూబ్లీహిల్స్‌లో కొనసాగుతున్న ఓ ఆస్తి వివాదంలో నటి స్వాతి దీక్షిత్‌తో పాటు పలువురిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు బుక్ చేశారు.ప్లాట్ విక్రయంలో స్వాతి దీక్షిత్‌, ఆమె స్నేహితులు మధ్యవర్తులుగా ఉన్నారు.

Published By: HashtagU Telugu Desk
Swathi Deekshith

Swathi Deekshith

Swathi Deekshith: జూబ్లీహిల్స్‌లో కొనసాగుతున్న ఓ ఆస్తి వివాదంలో నటి స్వాతి దీక్షిత్‌తో పాటు పలువురిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు బుక్ చేశారు. ప్లాట్ విక్రయంలో స్వాతి దీక్షిత్‌, ఆమె స్నేహితులు మధ్యవర్తులుగా ఉన్నారు. అయితే ఆర్థిక లావాదేవీలు వివాదాలకు దారితీశాయి. స్వాతి దీక్షిత్ ఆస్తిని మరొక వ్యక్తికి లీజుకు ఇవ్వడానికి ప్రయత్నించడంతో విభేదాలు మరింత పెరిగాయి. అయితే ఆ ప్లాట్ యజమాని ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారట.

ప్రవాస భారతీయుడి ఇంట్లోకి చొరబడ్డారనే ఆరోపణలపై సినీనటి స్వాతి దీక్షిత్‌తో పాటు మరికొంత మందిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ ఎన్‌ఆర్‌ఐతో విభేదిస్తున్న స్వాతి దీక్షిత్ రూ. 30 కోట్ల ఆస్తిని లాక్కోవడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. ఇటీవల ఆమె ఆదేశాల మేరకు సుమారు 20 మంది వ్యక్తులు ఆవరణలోకి చొరబడి బీభత్సం సృష్టించి కేర్‌టేకర్‌ను బెదిరించారని. వాచ్‌మెన్ ఫిర్యాదు మేరకు పోలీసులు నటితో పాటు ఇతరులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇంటి లీజు కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది.

Also Read: Sara Tendulkar: నేను కూడా డీప్ ఫేక్ బాధితురాలినే: సారా టెండూల్కర్

  Last Updated: 22 Nov 2023, 07:38 PM IST