కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Surya) లీడ్ రోల్ లో కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాకు రెట్రో అన్న టైటిల్ లాక్ చేశారు. ఈ సినిమాను సూర్య తన సొంత బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్స్ లో నిర్మిస్తున్నారు. సూర్య సరసన పూజా హెగ్దే (Pooja Hegde) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా టీజర్ రిలీజ్ చేశారు.
రెట్రో టీజర్ (Retro Teaser) విషయానికి వస్తే.. మీ కోసం ఇక మీదట రౌడీయిజం మానేస్తా అంటూ సూర్య చెబుతాడు. కట్ షాట్స్ లో సూర్య వింటేజ్ మాస్ ఎలివేషన్స్ చూపిస్తారు. సూర్య మాస్ సినిమా తీసి చాలా రోజులు అవుతుంది అనుకుంటున్న ఫ్యాన్స్ కి ఇది మంచి ఫుల్ మీల్స్ ఇచ్చేలా ఉంది. సూర్య రెట్రో టీజర్ అదిరిపోయింది.
ముఖ్యంగా సినిమాలో కార్తిక్ సుబ్బరాజ్ మార్క్ మాస్ తో పాటు సూర్యని మరోసారి ఒక పది పదిహేళ్ల క్రితం మాస్ హీరోగా ఫ్యాన్స్ చూడాలనుకున్న కటౌట్ తో చూపించాడు. సూర్య చివరి సినిమా కంగువ అంచనాలను అందుకోకపోవడంతో ఈ సినిమా మీద చాలా ఫోకస్ పెట్టినట్టు ఉన్నారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2025 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సూర్య రెట్రో పాన్ ఇండియా రిలీజ్ ఫిక్స్ చేశారు.