Site icon HashtagU Telugu

Surya Kanguva : సూర్య కంగువ ఎబ్బే ఇది సరిపోదు సామి..!

Suriya Kanguva Movie Second Look Released

Suriya Kanguva Movie Second Look Released

Surya Kanguva కోలీవుడ్ స్టార్ సూర్య లీడ్ రోల్ లో శివ దర్శకత్వంలో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా కంగువ. ఈ సినిమాను యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ కలిసి నిర్మిస్తున్నారు. పీరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా నుంచి ఆమధ్య వచ్చిన కంగువ సాంగ్ ఆకట్టుకుంది. ఇక ప్రచార చిత్రాలు కూడా సినిమాపై ఆసక్తి కలిగిస్తున్నాయి.

We’re now on WhatsApp : Click to Join

అయితే పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్న ఈ సినిమాకు ఈ బజ్ ఏమాత్రం సరిపోదని చెప్పొచ్చు. సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచాలి.. ఆడియన్స్ కి ఎంగేజ్ అయ్యేలా కంటెంట్ ఇవ్వాలి. ఇదే లేకుండా డైరెక్ట్ రిలీజ్ చేస్తే ఎంత అద్భుతమైన సినిమా చేసినా వేస్ట్ అవుతుంది. రాజమౌళి లాంటి డైరెక్టర్స్ సినిమా సెట్స్ మీద ఉన్నప్పటి నుంచే ఆ ప్రాజెక్ట్ మీద క్యూరియాసిటీ పెంచే ప్రయత్నం చేస్తాడు.

అందుకే ఆయన సినిమాలు రిలీజ్ టైం కు భారీ బజ్ రాబట్టుకుంటాయి. కంగువ సూర్య ఫ్యాన్స్ కు అంచనాలు కలిగేలా చేస్తున్నా కామన్ ఆడియన్స్ ని ఈ సినిమా ఇంకా రీచ్ అవ్వట్లేదని చెప్పొచ్చు. సూర్య చాలా రోజుల తర్వాత కమర్షియల్ కంటెంట్ తో చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలైతే ఉన్నాయి. అయితే కంగువ ఆ ఎక్స్ పెక్టేషన్స్ ని అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.

ఈ సినిమా రిలీజ్ డేట్ పై కూడా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. సినిమా సమ్మర్ రిలీజ్ ముందు అనుకున్నా ఇప్పుడు ఆగష్టు, సెప్టెంబర్ లో రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు. ఇవేవి కుదరకపోతే దసరాకి రిలీజ్ చేసినా చేస్తారని టాక్.

Also Read : Malavika Mohanan : రాజా సాబ్ తర్వాత 2 కోట్ల హీరోయిన్ అవుతుందా..?