కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా శివ డైరెక్షన్ లో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ కంగువ. ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ లో జ్ఞానవేల్ రాజా నిర్మించారు. సినిమాకు రెండేళ్ల టైం 300 కోట్ల దాకా బడ్జెట్ పెట్టారు. గురువారం రిలీజైన కంగువ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఐతే ఈ సినిమా తమిళ్ లో పర్వాలేదు అన్నట్టు టాక్ తెచ్చుకుంది. సూర్య ఫ్యాన్స్ అతని నటనకు ఫిదా అవుతున్నారు.
ఐతే భారీ స్థాయిలో రిలీజైన కంగువ ఫస్ట్ డే వసూళ్లతో కూడా భారీ టార్గెట్ పెట్టుకున్నారు. గురువారం రిలీజైన కంగువ సినిమా 58.62 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. సినిమా సూర్య బాక్సాఫీస్ స్టామినా ఏంటన్నది చూపించింది. ఐతే తమిళ్ లో ఒక మోస్తారు పాజిటివ్ టాక్ తో రన్ అవుతున్న కంగువ తెలుగులో మాత్రం నిరాశ పరచే టాక్ తో నడుస్తుంది.
రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో..
ఇక్కడ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేదు. కంగువ సినిమా లో కథ కథనాల ఆశించిన విధంగా ఎమోషన్ వర్క్ అవుట్ అవ్వలేదు. అందుకే సినిమాను ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేకపోయారు. కంగువ సినిమాలో సూర్య రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపించారు. సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటించగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.
సూర్య కంగువ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడగా సినిమా ఓవరాల్ గా ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఐతే వచ్చిన ఈ కలెక్షన్స్ కూడా సూర్య స్టామినాను తెలియచేస్తున్నాయని చెప్పొచ్చు.