Site icon HashtagU Telugu

Surya Kanguva : కంగువ కోసం సూర్య ఏం చేస్తున్నాడో తెలుసా..?

Surya Kanguva Runtime Locked

Surya Kanguva Runtime Locked

Surya Kanguva కోలీవుడ్ స్టార్ సూర్య ప్రస్తుతం శివ డైరెక్షన్ లో కంగువ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో సూర్య డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నారు. పీరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా నుంచి అప్పట్లో వచ్చిన ఒక టీజర్ అంచనాలు పెంచగా త్వరలో సినిమా నుంచి మరో టీజర్ వదులుతున్నారని తెలుస్తుంది.

సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కోసం సూర్య డబ్బింగ్ పనులు మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టారు. అందులో భాగంగా సూర్య సినిమాకు సంబందించిన డబ్బింగ్ వర్క్ పూర్తి చేశారు.

సూర్య కంగువ ఒక సరికొత్త ప్రపంచానికి తీసుకెళ్తారని తెలుస్తుంది. సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడన్నది ఇంకా వెల్లడించలేదు. సినిమాతో సూర్య కూడా పాన్ ఇండియా రేంజ్ లో భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. కొంతకాలంగా కమర్షియల్ సినిమాలకు దూరంగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ వస్తున్న సూర్య కంగువ సినిమాతో పర్ఫెక్ట్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. ఈ సినిమాలో దిశా పటాని కూడా మరో హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.

Exit mobile version