Surya Kanguva Budget : సూర్య కంగువ షాక్ ఇస్తున్న బడ్జెట్.. చివర్లో ఆ ట్విస్ట్ ఇవ్వరుగా..?

Surya Kanguva Budget కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం చేస్తున్న కంగువపై భారీ అంచనాలు ఉన్నాయి. సౌత్ లో విలక్షణ నటుడిగా కమర్షియల్ సినిమాలతో పాటు కంటెంట్ ఉన్న సినిమాలతో

Published By: HashtagU Telugu Desk
Surya Kanguva First Day Collections

Surya Kanguva First Day Collections

Surya Kanguva Budget కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం చేస్తున్న కంగువపై భారీ అంచనాలు ఉన్నాయి. సౌత్ లో విలక్షణ నటుడిగా కమర్షియల్ సినిమాలతో పాటు కంటెంట్ ఉన్న సినిమాలతో రాణిస్తున్న సూర్య కొద్దిపాటి గ్యాప్ తర్వాత చేస్తున్న భారీ సినిమా కంగువ.

శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కంగువ సినిమాను స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ ఇప్పటి వరకు 200 కోట్లకు అటు ఇటుగా అని వినిపించగా లేటెస్ట్ గా బడ్జెట్ 200 కాదు 350 కోట్లు అని అంటున్నారు.

బాహుబలి, పి.ఎస్ 1,2 కె.జి.ఎఫ్, సలార్ సినిమాల తరహాలోనే సూర్య కంగువ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా బడ్జెట్ తెలిసి ఆ సినిమాల మాదిరిగానే కంగువ కూడా రెండు భాగాలుగా అని ట్విస్ట్ ఇస్తారా అని ఆడియన్స్ డౌట్ పడుతున్నారు. కంగువ సినిమా ను మేకర్స్ రెండు భాగాలుగా వదులుతారా ఒకే సినిమాలో 350 బడ్జెట్ రికవరీ అవుతుందా అన్న సందేహాలు వస్తున్నాయి.

సూర్య మాత్రం ఈ సినిమాపై సూపర్ కాన్ ఫిడెంట్ గా ఉన్నాడని తెలుస్తుంది. దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో వస్తున్న కంగువ ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి. సూర్య కంగువ రిలీజ్ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. పాన్ ఇండియా లెవెల్ లో సినిమాను భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే మరో పాన్ ఇండియా సినిమాతో క్లాష్ కాకుండా రిలీజ్ ఉండేలా చూస్తున్నారు.

Also Read : Nayanatara at GQ Young Infulential Indian Awards : నయనతారకు బాలీవుడ్ నీళ్లు పడ్డాయోచ్.. ఆ ఈవెంట్ లో ఎప్పుడు చూడని విధంగా షాకింగ్ లుక్..!

  Last Updated: 26 Apr 2024, 12:30 PM IST