Site icon HashtagU Telugu

Devi Sri Prasad : దేవి మీద సూర్య ఫ్యాన్స్ ఆగ్రహం రీజన్ ఏంటంటే..!

Devisri Prasad

Devisri Prasad

సినిమా సక్సెస్ అయితే అందులో ప్రతి యాస్పెక్ట్ గురించి ప్రత్యేకంగా చెబుతారు అదే సినిమా ఫెయిల్ అయితే అతని వల్ల ఇతని వల్ల అని చెబుతుంటారు. ఏది ఏమైనా డైరెక్టర్, హీరో మీద కొంత ఎఫెక్ట్ పడుతుంది. ఒకవేళ హీరో బాగా చేసినా కథ కథనాల వల్ల సినిమా టార్గెట్ రీచ్ కాలేకపోతే డైరెక్టర్ మీద ఫ్యాన్స్ ఎటాక్ చేస్తారు. రీసెంట్ గా రిలీజైన కంగువ సినిమా విషయంలో మాత్రం విచిత్రంగా మ్యూజిక్ డైరెక్టర్ మీద సూర్య ఫ్యాన్స్ విరుచుకు పడుతున్నారు.

సూర్య (Surya) లీడ్ రోల్ లో శివ (Siva) డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా కంగువ. స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కె ఈ జ్ఞనవేల్ రాజా ఈ సినిమా 350 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఐతే ఒకప్పుడు తన మ్యూజిక్ సూపర్ అన్న ఆడియన్స్ ఇప్పుడు దేవి (Devi Sri Prasad) ని ట్రోల్ చేస్తున్నారు. సూర్య కంగువ సినిమాలో దేవి బిజిఎం పై సూర్య ఫ్యాన్స్ తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ఫ్లాపైన సినిమాకు వారిని తొక్కేస్తున్నారు..

Kanguva సినిమాకు డిఎస్పీ సరైన మ్యూజిక్ ఇవ్వలేదని. అందుకే సినిమా రిజల్ట్ ఇలా ఉందని అంటున్నారు. తమిళ తంబీల టార్గెట్ లో దేవి శ్రీ ప్రసాద్ సూర్య కంగువ సినిమా వల్ల మాటలు పడుతున్నాడు. ఏ సినిమాకైనా మ్యూజిక్ డైరెక్టర్ తన ఫుల్ ఎఫర్ట్ పెట్టేస్తాడు. కానీ హిట్ అయిన సినిమాకు ఒక ఎత్తుకి లేపడం.. ఫ్లాపైన సినిమాకు వారిని తొక్కేస్తున్నారు.

డిఎస్పీ ప్రస్తుతం పుష్ప 2 సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నాడు. ఈ సినిమా విషయంలో దేవి పనితనం ఎలా ఉంటుందో చూడాలి. ఏది ఏమైనా దేవి శ్రీ ప్రసాద్ కు ఇది అనుకోని తలనొప్పులు తెస్తుందని చెప్పొచ్చు.